కోర్టుకెక్కి.. పరిహారం గెలిచి.. | Eugenie Bouchard and U.S.T.A. Reach Settlement | Sakshi
Sakshi News home page

కోర్టుకెక్కి.. పరిహారం గెలిచి..

Feb 24 2018 4:06 PM | Updated on Apr 4 2019 5:04 PM

Eugenie Bouchard and U.S.T.A. Reach Settlement - Sakshi

యూజినీ బౌచర్డ్‌

అమెరికా టెన్నిస్‌ సంఘం (యూఎస్‌టీఏ) నిర్లక్ష్యం కారణంగానే కెనడా టెన్నిస్‌ స్టార్‌ యూజినీ బౌచర్డ్‌ గాయపడిందని అమెరికా కోర్టు తేల్చింది. 2015  యుఎస్‌ ఓపెన్‌ సందర్భంగా లాకర్‌ రూమ్‌లో తాను జారిపడ్డానని, దాని వల్ల తన కెరీర్‌ దెబ్బతిందని ఆరోపిస్తూ, జరిగిన నష్టానికి పరిహారం చెల్లించాలని బౌచర్డ్‌ కోర్టులో దావా వేసిన సంగతి తెలిసిందే. దీంతో తొలి దశ విచారణ ముగించిన కోర్టు యూఎస్‌టీఏను తప్పుపట్టింది. లాకర్‌ రూమ్‌లో బౌచర్డ్‌ గాయపడటంలో ఆమె తప్పు 25 శాతం కాగా.. యూఎస్‌టీఏ నిర్లక్ష్యం 75 శాతం ఉందని కోర్టు వ్యాఖ్యానించింది.

కోర్టు తీర్పుపై బౌచర్డ్‌ ఆనందం వ్యక్తం చేసింది. 'కోర్టు తీర్పులో నాకు క్లీన్‌ చిట్‌ వచ్చింది. రెండున్నర సంవత్సరాలు గడిచిపోయాయి. ప్రస్తుత తీర్పుతో నేను సంతోషంగా ఉన్నాను' అని బౌచర్డ్‌ తెలిపింది. తుది దశ విచారణ ముగిశాక బౌచర్డ్‌కు చెల్లించాల్సిన పరిహారంపై కోర్టు తీర్పు ఇస్తుంది.

కోర్టులో బౌచర్డ్‌ దావా
కాగా, 2014 ఏటీపీ ర్యాంకింగ్స్‌లో బౌచర్డ్‌ టాప్-5 లో చోటు దక్కించుకోవడంతో టెన్నిస్‌లో మరో స్టార్‌ రాబోతోందని టెన్నిస్‌ అభిమానులు అనుకున్నారు. అయితే అందరి అంచనాలు తారుమారై బౌచర్డ్‌ కెరీర్‌ గాడి తప్పింది. ర్యాంకింగ్స్‌లో ఆమె ఏకంగా 116 వ స్థానానికి పడిపోయింది. అయితే తాను ఈ పరిస్థితికి చేరడానికి కారణం అమెరికా టెన్నిస్‌ సంఘం అని ఈ కెనడా స్టార్‌ ఆరోపించింది. 2015 యుఎస్‌ ఓపెన్‌ సందర్భంగా లాకర్‌ రూమ్‌లో కాలుజారి పడడంతో గాయపడ్డానని, అది తన కెరీర్‌ను దెబ్బతీసిందని ఆరోపిస్తూ.. తనకు జరిగిన నష్టానికి పరిహారం చెల్లించాలని కోరుతూ యూఎస్‌టీఏ పై బ్రూక్లిన్‌లోని డిస్ట్రిక్ కోర్టులో దావా వేసింది.

న్యూయార్క్‌లోని క్వీన్స్‌లో 2015 లో యుఎస్‌టీఏ గ్లాండ్ స్లామ్ టోర్నీని నిర్వహించింది. ఆ టోర్నీలో లాకర్ రూమ్‌లో తాను కాలు జారి కింద పడటంతో తీవ్రమైన నొప్పితో టోర్ని నుంచి వైదొలినట్టు విచారణ సందర్భంగా బౌచర్డ్‌ తెలిపింది. బాగా జారేలా, ప్రమాదకరంగా ఉన్న శుభ్రపరిచే పదార్థాలు వాడడం వల్లే నేను జారిపడ్డాను' అని ఆమె దావాలో పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement