ఇంగ్లండ్‌ను ఆపతరమా? | England Won The Toss And Elected to Bat First Against Afghanistan | Sakshi
Sakshi News home page

ఇంగ్లండ్‌ను ఆపతరమా?

Jun 18 2019 2:41 PM | Updated on Jun 18 2019 3:30 PM

England Won The Toss And Elected to Bat First Against Afghanistan - Sakshi

మాంచెస్టర్‌: వన్డే వరల్డ్‌కప్‌లో ఫేవరెట్‌ జట్లలో ఒకటిగా దిగిన ఆతిథ్య ఇంగ్లండ్‌ జట్టు మరో విజయంపై కన్నేసింది. ఇప్పటికే మూడు విజయాలను ఖాతాలో వేసుకుని పాయింట్ల పట్టికలో నాల్గో స్థానంలో ఉన్న ఇంగ్లండ్‌..ఇంకా పాయింట్ల ఖాతా తెరకుండా చివరి స్థానంలో ఉన్న అఫ్గానిస్తాన్‌తో తలపడుతోంది. అయితే గాయాల బెడద ఇంగ్లండ్‌ను కలవర పెడుతుంది. ఇప్పటికే డాషింగ్‌ ఒపెనర్‌ జేసన్‌ రాయ్‌ తొడ కండరాల గాయంతో రెండు మ్యాచ్‌లకు దూరం కావడం ఆందోళన కల్గిస్తోంది. ఈ టోర్నీలో ఇంగ్లండ్‌ అన్ని విభాగాల్లో అదరగొడుతోంది. టాపార్డర్‌ బ్యాట్స్‌మెన్‌ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నారు.

ముఖ్యంగా రూట్‌ రెండు సెంచరీలు సాధించి జోరు మీదున్నాడు. రూట్‌కు తోడుగా బట్లర్, బెయిర్‌స్టో, స్టోక్స్‌ చెలరేగితే ఇంగ్లండ్‌ మరోసారి 300 మైలురాయిని దాటడం లాంఛనమే. బౌలింగ్‌లో వోక్స్, జోఫ్రా ఆర్చర్, వుడ్, ఆదిల్‌ రషీద్‌లతో పటిష్టంగా ఉంది.ఇక ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ ఓడిన అఫ్గానిస్తాన్‌ అత్యద్భుత ప్రదర్శన చేస్తే తప్ప ఇంగ్లండ్‌ను నిలువరించడం కష్టం. బ్యాటింగ్‌తోపాటు బౌలింగ్‌ విభాగంలోనూ వారు అంచనాలను అందుకోలేకపోవడం ఆ జట్టు వరుస ఓటముల్ని చవిచూసింది. ఈ తరుణంలో ఇంగ్లండ్‌ను అఫ్గానిస్తాన్‌ ఆపడం కష్టంగానే కనిపిస్తోంది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఇంగ్లండ్‌ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. టాస్‌ గెలిచి ఇంగ్లండ్‌ కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌ తొలుత బ్యాటింగ్‌ చేసేందుకు మొగ్గుచూపాడు.

తుది జట్లు

ఇంగ్లండ్‌
ఇయాన్‌ మోర్గాన్‌(కెప్టెన్‌), బెయిర్‌ స్టో, జో రూట్‌, జేమ్స్‌ విన్సే, బెన్‌ స్టోక్స్‌, జోస్‌ బట్లర్‌, మొయిన్‌ అలీ, క్రిస్‌ మోరిస్‌, ఆదిల్‌ రషీద్‌, జోఫ్రా ఆర్చర్‌, మార్క్‌వుడ్‌

అఫ్గానిస్తాన్‌
గుల్బదిన్‌ నైబ్‌(కెప్టెన్‌), రహ్మత్‌ షా, నూర్‌ అలీ జద్రాన్‌, నజిబుల్లా జద్రాన్‌, హస్మతుల్లా షాహిది, అస్గార్‌ అఫ్గాన్‌, మహ్మద్‌ నబీ, ఇక్రమ్‌ అలీ ఖిల్‌, రషీద్‌ ఖాన్‌, ముజీబ్‌ ఉర్‌ రహ్మాన్‌, దవ్లాత్‌ జద్రాన్‌


 


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement