ఫీల్డింగ్‌ ఎంచుకున్న ఇంగ్లండ్‌

England Win Toss And Elected To Bowl - Sakshi

లార్డ్స్‌: ప్రపంచకప్‌లో భాగంగా నేడు డిఫెండింగ్‌ చాంపియన్‌ ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్‌లో ఆతిథ్య ఇంగ్లండ్‌ జట్టు టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకుంది. ఎటువంటి మార్పులు లేకుండా ఇంగ్లండ్‌ జట్టు బరిలోకి దిగుతోంది. ఆస్ట్రేలియా టీమ్‌లో రెండు మార్పులు చోటు చేసుకున్నాయి. కౌల్టర్‌ నైల్‌, జంపా స్థానాలలో బెహ్రన్‌డార్ఫ్‌, నాథన్‌ లయన్‌లు జట్టులోకి వచ్చారు.

ఇంగ్లండ్‌పై గెలిచి సెమీస్‌ బెర్త్‌ను సొంతం చేసుకోవాలని ఆసీస్‌.. శ్రీలంక చేతిలో ఎదురైన అనూహ్య పరాజయాన్ని మర్చిపోయి మళ్లీ విజయాల బాట పట్టాలని ఇంగ్లండ్‌ భావిస్తున్నాయి. 1992 తర్వాత ప్రపంచ కప్‌ వేదికపై ఆస్ట్రేలియాను ఇంగ్లండ్‌ ఇప్పటి వరకు ఓడించలేదు. గత రికార్డులతో సంబంధం లేకుండా ఈ మ్యాచ్‌లో పూర్తి విశ్వాసంతో బరిలోకి దిగి విజయం సాధించాలనే లక్ష్యంతో మోర్గాన్‌ బృందం ఉంది. ఏదేమైనా రెండు జట్లలో భారీ హిట్టర్లు ఉండటంతో నేటి మ్యాచ్‌ ప్రేక్షకులను కనువిందు చేయడం ఖాయం.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top