‘షెల్డన్‌ సెల్యూట్‌’పై కోచ్‌ అసహనం..!

England Coach Trevor Bayliss Not Amusing At Sheldon Cottrell Salute - Sakshi

లండన్‌ : వికెట్‌ తీసిన వెంటనే ‘సెల్యూట్‌’ చేసి వెస్టిండీస్‌ ఫాస్ట్‌బౌలర్‌ షెల్డన్ కాట్రెల్ తాజా వరల్డ్‌కప్‌లో ఓ నయా ట్రెండ్‌ సృష్టించాడు. పాకిస్తాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో వికెట్‌ తీసిన వెంటనే అంపైర్‌కు, డ్రెస్సింగ్‌ రూమ్‌వైపు సెల్యూట్‌ చేసి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు. వృత్తిరీత్యా సోల్జర్‌ అయిన కాట్రెల్‌ జమైకా డిఫెన్స్‌ ఫోర్స్‌కు గౌరవ సూచకంగా వికెట్‌ తీసిన వెంటనే మార్చ్‌ఫాస్ట్‌ చేసి సెల్యూట్‌ చేస్తానని వెల్లడించాడు. అయితే, షెల్డన్‌ సెల్యూట్‌పై ఇంగ్లండ్‌ కోచ్‌ ట్రెవర్‌ బేలిస్‌ మాత్రం అసహనం వ్యక్తం చేశాడు. తనకు నచ్చని ఒకేఒకే విషయం షెల్డన్‌ సెల్యూట్‌ అంటూ పేర్కొన్నాడు.
(వికెట్‌ పడగానే సెల్యూట్‌.. కారణం ఇదే)

‘ఆటగాళ్లేం నాలుగు పదుల వయసు వారు కాదు. ఇది కుర్రాళ్ల ఆట. సంబరాలు చేసుకునే విధానం ఒక్కో జట్టుకు ఒక్కోలా ఉంటుంది. ఆటగాళ్ల మధ్య సెలబ్రేషన్స్‌లో తేడాలుంటాయి. గెలుపు సంబరాలు అటు సహచరులకు, ఇటు అభిమానులకు ఉత్తేజాన్నిస్తాయి. అయితే, ఒకరి సెలబ్రేషన్స్‌.. మరొకరికి నచ్చాలనే నియమమేమీ లేదు. షెల్డన్‌ సెల్యూట్‌ విషయంలో నాకూ అలానే అనిపించింది’ అని చెప్పుకొచ్చాడు. ఇక ఈ శుక్రవారం ఇంగ్లండ్‌, వెస్టిండీస్‌ మధ్య మ్యాచ్‌ జరుగనుంది. 

(చదవండి : ఈ క్యాచ్‌ చూస్తే.. ‘సెల్యూట్‌’ చేయాల్సిందే)

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top