‘టైమ్‌–100 నెక్ట్స్‌’ జాబితాలో ద్యుతీ | Dutee Chand Named In TIME 100 Next List | Sakshi
Sakshi News home page

‘టైమ్‌–100 నెక్ట్స్‌’ జాబితాలో ద్యుతీ

Nov 14 2019 9:54 AM | Updated on Nov 14 2019 9:55 AM

Dutee Chand Named In TIME 100 Next List - Sakshi

న్యూఢిల్లీ: భారత మహిళా స్టార్‌ అథ్లెట్, ఆసియా క్రీడల్లో 100, 200 మీటర్ల విభాగాల్లో రజత పతకాలు నెగ్గిన ద్యుతీచంద్‌కు ‘టైమ్‌–100 నెక్ట్స్‌’ జాబితాలో చోటు దక్కింది. ప్రపంచ వ్యాప్తంగా రాబోయే రోజుల్లో ప్రభావం చూపగల వ్యక్తుల జాబితాలో ఆమెకు క్రీడల కేటగిరీలో చోటు లభించింది.

వ్యాపారం, వినోదం, క్రీడలు, రాజకీయాలు, ఆరోగ్యం, సైన్స్‌ రంగాల్లో అత్యంత ప్రభావశీలురను గుర్తించి టైమ్‌ మేగజైన్‌ ప్రతీయేటా ఈ జాబితాను తయారు చేస్తుంది. ఈ జాబితాలో స్థానం దక్కడంపై ద్యుతీచంద్‌ సంతోషం వ్యక్తం చేసింది.

Advertisement
 
Advertisement
Advertisement