మామ అంత్యక్రియల కోసం...దక్షిణాఫ్రికా వెళ్లిన ఫ్లెచర్ | Duncan Fletcher leaves for Cape Town | Sakshi
Sakshi News home page

మామ అంత్యక్రియల కోసం...దక్షిణాఫ్రికా వెళ్లిన ఫ్లెచర్

Feb 27 2015 1:01 AM | Updated on Sep 2 2017 9:58 PM

మామ అంత్యక్రియల కోసం...దక్షిణాఫ్రికా వెళ్లిన ఫ్లెచర్

మామ అంత్యక్రియల కోసం...దక్షిణాఫ్రికా వెళ్లిన ఫ్లెచర్

భారత క్రికెట్ జట్టు కోచ్ డంకన్ ఫ్లెచర్ కొద్ది రోజుల పాటు జట్టుకు దూరం కానున్నారు.

 పెర్త్: భారత క్రికెట్ జట్టు కోచ్ డంకన్ ఫ్లెచర్ కొద్ది రోజుల పాటు జట్టుకు దూరం కానున్నారు. దక్షిణాఫ్రికాలోని కేప్‌టౌన్‌లో మృతి చెందిన తన మామ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు ఫ్లెచర్ బయల్దేరి వెళ్లారు. ఈ విషయాన్ని భారత టీమ్ మేనేజ్‌మెంట్ నిర్ధారించింది. జింబాబ్వేకు చెందిన ఫ్లెచర్ కుటుంబం కేప్‌టౌన్‌లోనే స్థిరపడింది.
 
 ఇక్కడి వాకా మైదానంలో శనివా రం యూఏ ఈతో తలపడనున్న ధోని సేన... వచ్చే శుక్రవారం ఇక్కడే వెస్టిండీస్‌ను ఎదుర్కొం టుంది. విండీస్‌తో మ్యాచ్‌లోగా డంకన్ తిరిగొచ్చే అవకాశం ఉంది.  ఫ్లెచర్ గైర్హాజరీతో టీమ్ డెరైక్టర్ రవిశాస్త్రి మార్గదర్శనంలో అసిస్టెంట్ కోచ్‌లు సంజయ్ బం గర్, భరత్ అరుణ్, శ్రీధర్ ప్రాక్టీస్‌ను పర్యవేక్షిస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement