
భారత జట్టులోకి ఎంపిక కావాలన్న తన సుదీర్ఘ స్వప్నం నిజం కావడం పట్ల తమిళనాడు ఆల్‌రౌండర్ విజయ్ శంకర్ సంతోషం వ్యక్తం చేశాడు. టీమిండియా పిలుపును ఊహించలేదన్న అతను, తన ఇన్నేళ్ల కష్టం ఫలించిందని ఉద్వేగంగా చెప్పాడు. భారత ‘ఎ’ జట్టు సభ్యుడిగా ఉన్న సమయంలోనే తన ఆట ఎంతో మెరుగైందని అన్నాడు.
26 ఏళ్ల విజయ్ శంకర్ 32 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లలో 49.14 సగటుతో 1671 పరుగులు చేయడంతో పాటు 27 వికెట్లు పడగొట్టాడు. తన వివాహం కారణంగా శ్రీలంకతో జరిగే చివరి రెండు టెస్టులకు భువనేశ్వర్ అందుబాటులో లేకపోవడంతో అతని స్థానంలో విజయ్ శంకర్ జట్టులోకి వచ్చాడు.