క్వార్టర్స్‌లో దివిజ్‌ జంట ఓటమి  | divij sharan loss the game | Sakshi
Sakshi News home page

క్వార్టర్స్‌లో దివిజ్‌ జంట ఓటమి 

Aug 5 2018 1:06 AM | Updated on Aug 5 2018 1:06 AM

divij sharan loss the game - Sakshi

వాషింగ్టన్‌: సిటీ ఓపెన్‌ ఏటీపీ–500 టెన్నిస్‌ టోర్నమెంట్‌లో దివిజ్‌ శరణ్‌ (భారత్‌)–ఆర్తెమ్‌ సితాక్‌ (న్యూజిలాండ్‌) జంట పోరాటం ముగిసింది. పురుషుల డబుల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో అన్‌సీడెడ్‌ దివిజ్‌–సితాక్‌ ద్వయం 6–4, 1–6, 5–10తో నాలుగో సీడ్‌ జేమీ ముర్రే (ఇంగ్లండ్‌)–బ్రూనో సొరెస్‌ (బ్రెజిల్‌) జోడీ చేతిలో ఓడిపోయింది.
 

76 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో దివిజ్‌ జంట రెండు ఏస్‌లు సంధించి, తమ సర్వీస్‌ను రెండుసార్లు కోల్పోయింది. క్వార్టర్‌ ఫైనల్లో ఓడిన దివిజ్‌ జోడీకి 14,580 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 10 లక్షలు)తోపాటు 90 ర్యాంకింగ్‌ పాయింట్లు లభించాయి.    

Advertisement
 
Advertisement
Advertisement