దినేశ్‌ కార్తీక్‌.. మై సూపర్‌ హీరో : దీపికా  | Dipika Pallikal Feels Proud For Karthik Super Performance | Sakshi
Sakshi News home page

Mar 20 2018 4:51 PM | Updated on Mar 20 2018 4:51 PM

Dipika Pallikal Feels Proud For Karthik Super Performance - Sakshi

దినేశ్‌ కార్తీక్‌, దీపికా పల్లికల్‌ (ఫైల్‌ ఫొటో)

సాక్షి, స్పోర్ట్స్‌ : నిదహాస్‌ ట్రోఫీలో చివరి బంతిని సిక్స్‌ బాది భారత్‌కు అనూహ్య విజయాన్నందించిన టీమిండియా వికెట్‌ కీపర్‌ దినేశ్‌ కార్తీక్‌పై సోషల్‌ మీడియా వేదికగా అభిమానులు, మాజీ క్రికెటర్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్న విషయం తెలిసిందే. అయితే కార్తీక్‌ ప్రదర్శన పట్ల అతని సతీమణి భారత స్టార్‌ స్క్వాష్‌  క్రీడాకారిణి దీపికా పల్లికల్‌ ఆనందం వ్యక్తం చేశారు. మ్యాచ్‌ అనంతరం టీవీలో కనిపిస్తున్న దినేశ్‌ కార్తీక్‌ ఫొటోపై ‘మై దాదా మై సూపర్‌హీరో’ అనే క్యాఫ్షన్‌తో ఇన్‌స్టాగ్రమ్‌లో పోస్ట్‌ చేశారు. ఇక మరో పోస్ట్‌లో కార్తీక్‌ ఫొటో లవ సింబల్స్‌తో తన ప్రేమను చాటుకున్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్‌లు అభిమానులను తెగ ఆకట్టుకుంటున్నాయి.

ఇక సూపర్‌ సిక్సుతో సూపర్‌ స్టార్‌ అయిన దినేశ్‌ కార్తీక్‌ తొలుత చిన్ననాటి స్నేహితురాలు నిఖితను పెళ్లి చేసుకున్నాడు. అనుకొని కారణాలతో 2012లో ఆమెతో విడిపోవాల్సి వచ్చింది. తర్వాత నిఖితను భారత క్రికెటర్‌ మురళీ విజయ్‌ పెళ్లి చేసుకున్నాడు. అనంతరం కార్తీక్‌... దీపికా పల్లికల్‌ను 2015లో ప్రేమ వివాహం చేసుకున్నాడు.

Advertisement
 
Advertisement
Advertisement