‘డైమండ్’ బోల్ట్ | Diamond' usain Bolt | Sakshi
Sakshi News home page

‘డైమండ్’ బోల్ట్

Aug 31 2013 1:42 AM | Updated on Sep 1 2017 10:17 PM

‘డైమండ్’ బోల్ట్

‘డైమండ్’ బోల్ట్

జమైకా స్టార్ అథ్లెట్ ఉసేన్ బోల్ట్ 100 మీటర్ల విభాగంలో మరోసారి తన ఆధిపత్యాన్ని చాటుకున్నాడు. ఇటీవల మాస్కోలో జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం సాధించిన బోల్ట్ అదే జోరును డైమండ్ లీగ్ మీట్‌లోనూ కొనసాగించాడు.

 జ్యూరిచ్: జమైకా స్టార్ అథ్లెట్ ఉసేన్ బోల్ట్ 100 మీటర్ల విభాగంలో మరోసారి తన ఆధిపత్యాన్ని చాటుకున్నాడు. ఇటీవల మాస్కోలో జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం సాధించిన బోల్ట్ అదే జోరును డైమండ్ లీగ్ మీట్‌లోనూ కొనసాగించాడు. భారత కాలమానం ప్రకారం గురువారం అర్ధరాత్రి దాటాక జరిగిన పురుషుల 100 మీటర్ల రేసులో బోల్ట్ విజేతగా నిలిచాడు. అతను ఈ రేసును 9.90 సెకన్లలో పూర్తి చేశాడు.
 
  నికెల్ (జమైకా,9.94 సెకన్లు), జస్టిన్ గాట్లిన్ (అమెరికా, 9.96 సెకన్లు) వరుసగా రజత, కాంస్య పతకాలను సాధించారు. వచ్చే నెల 6న బ్రస్సెల్స్‌లో జరిగే డైమండ్ లీగ్ ఫైనల్స్‌లో బోల్ట్ పోటీపడే అవకాశముంది. ‘పూర్తి ఫిట్‌గా లేకపోయినా పరిగెత్తాను. సీజన్ కొనసాగుతున్నకొద్దీ నేను అలసిపోతాను. ఎలాంటి గాయాలు లేకుండా సీజన్‌ను ముగించాలని భావిస్తున్నాను’ అని బోల్ట్ వ్యాఖ్యానించాడు.
 

Advertisement
 
Advertisement
Advertisement