'రావణుడిలాగే ధోనీ మూల్యం చెల్లిస్తాడు' | Dhoni is arrogant, will beg one day: Yograj Singh | Sakshi
Sakshi News home page

'రావణుడిలాగే ధోనీ మూల్యం చెల్లిస్తాడు'

Apr 7 2015 6:25 PM | Updated on May 28 2018 2:02 PM

'రావణుడిలాగే ధోనీ మూల్యం చెల్లిస్తాడు' - Sakshi

'రావణుడిలాగే ధోనీ మూల్యం చెల్లిస్తాడు'

టీమిండియా డాషింగ్ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ తండ్రి, మాజీ క్రికెటర్ యోగ్రాజ్ సింగ్.. కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీపై మరోసారి విమర్శలు ఎక్కుపెట్టారు.

న్యూఢిల్లీ: టీమిండియా డాషింగ్ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ తండ్రి, మాజీ క్రికెటర్ యోగ్రాజ్ సింగ్.. కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీపై మరోసారి విమర్శలు ఎక్కుపెట్టారు. ధోనీ దురంహకారని విమర్శించారు. ఇటీవల జరిగిన వన్డే ప్రపంచ కప్లో యువరాజ్కు భారత జట్టులో చోటు దక్కని సంగతి తెలిసిందే. యువీకి స్థానం దక్కకపోవడానికి ధోనీయే కారణమని ఆరోపించిన యోగరాజ్ మరోసారి ధోనీపై మండిపడ్డారు.

'ధోనీ చేసిందేమీ లేదు. మీడియా వల్లే ధోనీ క్రికెట్ దేవుడయ్యాడు. మీడియా ధోనీని గొప్పగా చిత్రీకరించింది. ఇందుకు అతను అనర్హుడు' అని యోగ్రాజ్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. యోగ్రాజ్.. ధోనీని రావణుడితో పోల్చారు. 'ధోనీ దురహంకారి. ఇలాగే అహంకారంతో విర్రవీగిన రావణుడి కథ ముగిసింది. ధోనీ కూడా ఏదో ఒక రోజు మూల్యం చెల్లిస్తాడు. రావణుడి కంటే గొప్పవాడని ధోనీ భావిస్తున్నాడు. 2011 ప్రపంచ కప్లో ధోనీ యువరాజ్ను ఆపి బ్యాటింగ్కు వెళ్లి హీరో అయ్యాడు. 2015 ప్రపంచ కప్ సెమీస్లో ధోనీ నాలుగో స్థానంలో ఎందుకు బ్యాటింగ్కు దిగలేదు' అని యోగరాజ్ విమర్శించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement