ధీరజ్, సౌమ్య ముందంజ | dheeraj, sowmya leading in icse schools tennis tourney | Sakshi
Sakshi News home page

ధీరజ్, సౌమ్య ముందంజ

Jul 27 2017 10:34 AM | Updated on Sep 5 2017 5:01 PM

ధీరజ్, సౌమ్య ముందంజ

ధీరజ్, సౌమ్య ముందంజ

తెలంగాణ–ఏపీ రీజియన్‌ ఐసీఎస్‌ఈ, ఐఎస్‌సీ స్కూల్స్‌ టెన్నిస్‌ చాంపియన్‌షిప్‌లో సెయింట్‌ జోసెఫ్‌ విద్యార్థులు కె. ధీరజ్, సౌమ్య ముందంజ వేశారు.

ఐసీఎస్‌ఈ–ఐఎస్‌సీ స్కూల్స్‌ టెన్నిస్‌ టోర్నీ  


సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ–ఏపీ రీజియన్‌ ఐసీఎస్‌ఈ, ఐఎస్‌సీ స్కూల్స్‌ టెన్నిస్‌ చాంపియన్‌షిప్‌లో సెయింట్‌ జోసెఫ్‌ విద్యార్థులు కె. ధీరజ్, సౌమ్య ముందంజ వేశారు. సికింద్రాబాద్‌లోని వశిష్ట టెన్నిస్‌ అకాడమీలో బుధవారం జరిగిన జూనియర్‌ బాలుర సింగిల్స్‌ తొలిరౌండ్‌లో ధీరజ్‌ 7–1తో సాత్విక్‌ (గీతాంజలి)పై విజయం సాధించాడు.

బాలికల విభాగంలో సౌమ్య 7–2తో సంస్కృతి (గీతాంజలి)ని ఓడించి ముందంజ వేసింది. ఇతర బాలికల మ్యాచ్‌ల్లో ఓజస్వి (హెచ్‌సీఎస్‌) 7–0తో జి. నందిక (గీతాంజలి)పై, రేష్మా (శివ శివాని) 7–2తో మేఘన (ఎఫ్‌కేఎస్‌)పై, నోహిల (సెయింట్‌ పాల్స్‌) 7–3తో శ్రేయ (ఎస్‌ఏఎస్‌ఆర్‌)పై, గాయత్రి (శ్రీ అరబిందో) 7–2తో యశస్విని (సెయింట్‌ జోసెఫ్‌)పై, అనీశా రెడ్డి (సెయింట్‌ ఆన్స్‌) 7–0తో రక్షణ రెడ్డిపై గెలుపొందారు.

జూనియర్‌ బాలుర ఫలితాలు

బృహత్‌ కాలేరు (కేఏఎల్‌పీఏ) 7–0తో జె. పవన్‌ (గీతాంజలి)పై, సాయి అభిజ్ఞాన్‌ (ఎన్‌ఏఎస్‌ఆర్‌) 7–3తో జి. ప్రణవ్‌ (హెచ్‌పీఎస్‌)పై, అనుదీప్‌ రెడ్డి (జాన్సన్‌) 7–3తో గిరి యశ్వంత్‌ (షేర్‌వుడ్‌)పై, కృష్ణ (గీతాంజలి) 7–4తో కార్తీక్‌పై, ఫజల్‌ అలీ (ఎన్‌ఏఎస్‌ఆర్‌) 7–4తో రాజ్‌ సింగ్‌ (షేర్‌వుడ్‌)పై, కాశీ విశ్వనాథ రావు (జాన్సన్‌) 7–4తో యువరాజ్‌ (హెచ్‌పీఎస్‌)పై విజయం సాధించారు. 


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement