ధావన్ బౌలింగ్ శైలి సందేహాస్పదం | Dhawan bowling style in doubt | Sakshi
Sakshi News home page

ధావన్ బౌలింగ్ శైలి సందేహాస్పదం

Dec 10 2015 2:18 AM | Updated on Sep 3 2017 1:44 PM

ధావన్ బౌలింగ్ శైలి సందేహాస్పదం

ధావన్ బౌలింగ్ శైలి సందేహాస్పదం

దక్షిణాఫ్రికాతో జరిగిన నాలుగో టెస్టులో భారత ఓపెనర్ శిఖర్ ధావన్ బౌలింగ్ శైలి సందేహాస్పదంగా ఉందని మ్యాచ్ అధికారులు తెలిపారు.

దుబాయ్: దక్షిణాఫ్రికాతో జరిగిన నాలుగో టెస్టులో భారత ఓపెనర్ శిఖర్ ధావన్ బౌలింగ్ శైలి సందేహాస్పదంగా ఉందని మ్యాచ్ అధికారులు తెలిపారు. దీనికి సంబంధించిన నివేదికను భారత టీమ్ మేనేజ్‌మెంట్‌కు అందజేశారు. ధావన్ ఆఫ్ స్పిన్ బంతులను వేసేటప్పుడు మోచేతిని నిబంధనల కంటే ఎక్కువగా వంచుతున్నాడని అంపైర్లు తేల్చారు. దీంతో 14 రోజుల్లోగా ధావన్ బౌలింగ్ పరీక్షకు హాజరు కావాలని ఐసీసీ సూచించింది. ఈ సమయంలో అంతర్జాతీయ క్రికెట్‌లో బౌలింగ్ చేసుకోవచ్చని వెల్లడించింది. ఢిల్లీ టెస్టులో కేవలం మూడు ఓవర్లు వేసిన ధావన్.. 9 పరుగులిచ్చాడు.
 

Advertisement
 
Advertisement
Advertisement