breaking news
indian team management
-
తిలక్ వర్మ... పేరు గుర్తుంచుకోండి!
తిలక్ పేరులో ‘లక్’ ఉంది. ఈ ‘లక్’ చోటు వచ్చేందుకు పనికొస్తుందేమో కానీ... రాణించేందుకు ఏమాత్రం ఉపయోగపడదు. శక్తి, సామర్థ్యాలతో పాటు టెక్నిక్, వచి్చన అవకాశాన్ని సది్వనియోగం చేసుకోవాలన్న పట్టుదల, పాతుకుపోవాలన్న సంకల్పమే ఏ ఆటగాడినైనా నిలబెడతాయి. ఎడంచేతి వాటం బ్యాటర్ తిలక్ వర్మ కూడా అదే చేశాడు. కష్టపడే జట్టులోకి వచ్చాడు. వచ్చాక ప్రత్యర్థి బౌలర్ల భరతం పడుతున్నాడు. బ్యాటింగ్‌లో ఈ నిలకడే భారత టీమ్ మేనేజ్మెంట్ కంట నాలుగో స్థానంపై ఆశాకిరణమయ్యేలా చేస్తోంది. ఠాకూర్ తిలక్ వర్మ ఐపీఎల్లో దంచేస్తుంటే అందరికి తెలిసొచి్చంది. కానీ హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) డివిజన్ లీగ్ క్రికెట్లోనే అతను వార్తల్లో వ్యక్తి అని చాలా మందికి తెలియదు. మూడు రోజుల ఆటలో జట్టును అర్ధ సెంచరీలతో ఆదుకున్నాడు. సెంచరీలతో గెలిపించాడు. ఐపీఎల్ వేలంలోకి వచ్చాక లీగ్‌లో మనోడున్నాడు అనిపించాడు. నిలకడైన ఆటతో మెల్లిగా ముంబై ఇండియన్స్ జట్టు మొనగాడయ్యాడు. ఇప్పుడు కరీబియన్‌కు తీసుకెళ్తే భారత ఆశాకిరణమయ్యాడు. అలా ఒక్కో మెట్టెక్కుతూ... కింది నుంచే పైకొచ్చాడు. గతేడాది ఐపీఎల్లో అరంగేట్రం చేసిన తిలక్ ఆ సీజన్లో ముంబైని మురిపించాడు. షాట్ల ఎంపిక, బంతిని పంపిన ప్లేసింగ్ తీరు, ధాటిగా ఆడే నైపుణ్యం ఇవన్నీ గమనించిన ముంబై యాజమాన్యం అతనికి విరివిగా అవకాశాలిచి్చంది. అన్ని మ్యాచ్‌ల్లో బరిలోకి దింపింది. దాంతో 131.02 స్ట్రయిక్‌రేట్‌తో 397 పరుగులు చేశాడు. 36.09 సగటు నమోదు చేశాడు. ఈ సీజన్లోనూ 11 మ్యాచ్‌ల్లో ఆడిస్తే 164.11 స్ట్రయిక్ రేట్‌తో 343 పరుగులు చేశాడు. సగటేమో 42.87! అంటే ఈ రెండేళ్లలో సగటు, స్ట్రయిక్‌రేట్ రెండు పెంచుకున్నాడు. జట్టు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టాడు. ఈ గణాంకాలతోనే తిలక్ వర్మ అదరగొట్టాడనుకుంటే పొరబడినట్లే! ఎందుకంటే ముంబై కష్టాల్లో ఉంటే ఆటగాళ్లపై ఒత్తిడి పెరిగితే... అతను మాత్రం యథేచ్ఛగా ఆడిన తీరే అందరిమెప్పు పొందేలా చేసింది. క్రికెట్ విశ్లేషకులు, ప్రముఖ టీవీ వ్యాఖ్యా తలే కాదు... దిగ్గజ క్రికెటర్లు సైతం తిలక్ వర్మ ఆటకు, ఆడిన తీరుకు ముచ్చటపడ్డారు. ప్రశంసలు కురిపించారు. విండీస్‌లో సిక్సర్లతో... అతని ప్రతిభను బీసీసీఐ సీనియర్ సెలక్షన్ కమిటీ కూడా గుర్తించి కరీబియన్ పర్యటనకు పంపింది. కేవలం టి20ల్లో మాత్రమే అవకాశమిచ్చింది. అంతర్జాతీయ క్రికెట్లో అరుదుగా లభించిన ఈ సదవకాశాన్ని హైదరాబాదీ లెఫ్ట్ హ్యాండర్ వదులుకోలేదు. కోచ్ రాహుల్ ద్రవిడ్, కెపె్టన్ హార్దిక్ పాండ్యాల గేమ్ ప్లాన్‌లో భాగమైన తిలక్... విండీస్ తురుపుముక్కలైన సీమర్లను సునాయాసంగా ఎదుర్కొన్నాడు. ఎదుర్కొన్న తొలి బంతికి పరుగు తీయలేకపోయాడు... కానీ అంతర్జాతీయ పరుగుల ప్రయాణాన్ని మాత్రం సిక్సర్లతో ప్రారంభించాడు. తొలి రెండు టి20ల్లో 39 పరుగులు, 51 పరుగులు అతనిదే టాప్ స్కోర్! తర్వాత మూడు మ్యాచ్‌ల్లో 49 నాటౌట్, 7 నాటౌట్, 27 పరుగులు... ఇలా ప్రతి మ్యాచ్‌లోనూ బాధ్యత కనబరిచాడు. ఓవరాల్‌గా 173 పరుగులతో ఈ సిరీస్‌లో భారత టాప్ స్కోరర్‌గా అవతరించాడు. అందుకే భారత కెపె్టన్ రోహిత్ ఓ ఇంటర్యూలో హైదరాబాదీ ఆటగాడిని ప్రత్యేకంగా ప్రస్తావించాడు, ప్రశంసించాడు. ఆసియా కప్, ప్రపంచకప్‌లపై... యువరాజ్ సింగ్ రిటైర్మెంట్ తర్వాత బదులు తోచని ప్రశ్నగా మిగిలిపోయిన నాలుగో స్థానం ఇప్పుడు తిలక్‌ను ఊరిస్తోంది. ఆసియా కప్‌లో సెలక్టర్లు మాత్రం అతన్ని కొనసాగించే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి. ఇక అక్కడ కూడా మ్యాచ్ మ్యాచ్‌కు ఇలాంటి నిలకడ, ధాటైన జోరు కొనసాగిస్తే మాత్రం స్వదేశంలో జరిగే వన్డే ప్రపంచకప్ కోసం అతని పేరును పరిశీలించడం, చోటివ్వడం ఖాయమవుతుందేమో చూడాలి. –సాక్షి క్రీడా విభాగం -
జట్టులో లేని ఆటగాళ్లను పంపిస్తారా?
సౌతాంప్టన్: భారత జట్టు మేనేజ్మెంట్ తీరుపై అసహనం వ్యక్తం చేసిన విలేకర్లు మీడియా సమావేశాన్ని బాయ్‌కాట్ చేశారు. ప్రపంచకప్‌లో రేపు భారత్ తొలి మ్యాచ్ ఆడనుంది. ఈ నేపథ్యంలో సోమవారం మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయగా... దీనికి నెట్ ప్రాక్టీస్ కోసం ఇంగ్లండ్ వెళ్లిన బౌలర్లు దీపక్ చహర్, అవేశ్ ఖాన్, ఖలీల్ అహ్మద్‌లు వచ్చారు. అంతర్జాతీయ మీడియా ప్రతినిధులు... టీమిండియా కెప్టెన్ కోహ్లి కాకపోయినా, హెడ్‌కోచ్ రవిశాస్త్రినో లేదంటే కనీసం సీనియర్ క్రికెటర్ ఎవరైనా వస్తారని ఆశించారు. తీరా జట్టులో చోటేలేని ఆటగాళ్లు మీడియా హాల్లో కనబడటంతో అసంతృప్తి వ్యక్తం చేసిన విలేకరులు... సమావేశాన్ని బాయ్‌కాట్ చేశారు. దీనిపై టీమిండియా మీడియా మేనేజర్‌ను సంప్రదించగా... భారత్ ప్రపంచకప్ ఆట ఇంకా మొదలుకాకపోవడం వల్లే నెట్ బౌలర్లను పంపించాల్సి వచ్చిందని బదులిచ్చాడు. గత ప్రపంచకప్‌లోనూ భారత జట్టుతో మీడియాకు ఇలాంటి పరిస్థితులే ఎదురయ్యాయి. అప్పటి కెప్టెన్ ధోని మీడియా సమావేశాలకు అంతగా ప్రాధాన్యత ఇవ్వలేదు. బుమ్రాకు డోప్ టెస్టు: భారత పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు సోమవారం డోప్ టెస్టు నిర్వహించారు. ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ (వాడా) గుర్తింపు ఉన్న ఏజెన్సీ బుమ్రా నుంచి మూత్ర నమూనాలను సేకరించింది. ఇది ప్రపంచకప్ టోర్నీ కావడంతో పలానా జట్టుకు అని కాకుండా ర్యాండమ్‌గా ఎవరికైనా డోపింగ్ పరీక్షలు నిర్వహించే అవకాశముంటుంది. -
ధావన్ బౌలింగ్ శైలి సందేహాస్పదం
దుబాయ్: దక్షిణాఫ్రికాతో జరిగిన నాలుగో టెస్టులో భారత ఓపెనర్ శిఖర్ ధావన్ బౌలింగ్ శైలి సందేహాస్పదంగా ఉందని మ్యాచ్ అధికారులు తెలిపారు. దీనికి సంబంధించిన నివేదికను భారత టీమ్ మేనేజ్మెంట్కు అందజేశారు. ధావన్ ఆఫ్ స్పిన్ బంతులను వేసేటప్పుడు మోచేతిని నిబంధనల కంటే ఎక్కువగా వంచుతున్నాడని అంపైర్లు తేల్చారు. దీంతో 14 రోజుల్లోగా ధావన్ బౌలింగ్ పరీక్షకు హాజరు కావాలని ఐసీసీ సూచించింది. ఈ సమయంలో అంతర్జాతీయ క్రికెట్లో బౌలింగ్ చేసుకోవచ్చని వెల్లడించింది. ఢిల్లీ టెస్టులో కేవలం మూడు ఓవర్లు వేసిన ధావన్.. 9 పరుగులిచ్చాడు.