పాకిస్తాన్‌లో క్రికెట్ మ్యాచ్‌లు ఆడేందుకు వెస్టిండీస్ క్రికెట్ బోర్డు (డబ్ల్యుఐసీబీ) నిరాకరించింది.
కరాచీ: పాకిస్తాన్‌లో క్రికెట్ మ్యాచ్‌లు ఆడేందుకు వెస్టిండీస్ క్రికెట్ బోర్డు (డబ్ల్యుఐసీబీ) నిరాకరించింది. దీంతో తమ దేశంలో క్రికెట్ పునరుద్ధరణకు విశ్వప్రయత్నం చేస్తున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)ను విండీస్ నిర్ణయం నిరాశలో ముంచింది. ఈ సెప్టెంబర్-అక్టోబర్‌లో యూఏఈలో ఇరు జట్ల మధ్య వన్డే సిరీస్ జరగనుంది.
అయితే దీంట్లో రెండు మ్యాచ్‌లను పాక్‌లో ఆడాల్సిందిగా విండీస్ క్రికెట్ బోర్డు (డబ్ల్యుఐసీబీ)ను పీసీబీ కోరింది. కానీ భద్రతాకారణాల రీత్యా సిరీస్ మొత్తాన్ని యూఏఈలోనే ఆడతామని విండీస్ బోర్డు తమకు తెలిపినట్టు పీసీబీ పేర్కొంది. తమ దేశంలో పరిస్థితులు మారాయని వివిధ బోర్డులకు ఎంత నచ్చజెప్పినా ప్రయోజనం లేకుండా పోతోందని పీసీబీ ఉన్నతాధికారి అన్నారు.