ఫీల్డింగ్ ఎంచుకున్న ఢిల్లీ | delhi dare devisl won the toss and elected to fielding first | Sakshi
Sakshi News home page

ఫీల్డింగ్ ఎంచుకున్న ఢిల్లీ

Apr 17 2016 7:40 PM | Updated on Sep 3 2017 10:08 PM

ఐపీఎల్లో భాగంగా ఆదివారం ఇక్కడ చిన్నస్వామి స్టేడియంలో రాయల్ చాలెంజర్స్ బెంగూళురుతో జరుగుతున్న మ్యాచ్లో ఢిల్లీ డేర్ డెవిల్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.

బెంగళూరు: ఐపీఎల్లో భాగంగా ఆదివారం ఇక్కడ చిన్నస్వామి స్టేడియంలో రాయల్ చాలెంజర్స్ బెంగూళురుతో జరుగుతున్న మ్యాచ్లో ఢిల్లీ డేర్ డెవిల్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన డేర్ డెవిల్స్ కెప్టెన్ జహీర్ ఖాన్ తొలుత రాయల్ చాలెంజర్స్ను బ్యాటింగ్కు ఆహ్వానించాడు. ఈ టోర్నీలో ఇప్పటివరకూ  ఒక మ్యాచ్ మాత్రమే ఆడిన రాయల్ చాలెంజర్స్ అందులో విజయం సాధించగా, ఢిల్లీ డేర్ డెవిల్స్ ఆడిన రెండింటిలో ఒక దాంట్లో ఓడి, మరొక మ్యాచ్లో గెలిచింది.  

 

క్రిస్ గేల్, విరాట్ కోహ్లి, ఏబీ డివిలియర్స్, షేన్ వాట్సన్ , సర్పరాజ్ ఖాన్, కేదర్ జాదవ్లతో రాయల్ చాలెంజర్స్ బ్యాటింగ్ లైనప్ పటిష్టంగా ఉండగా, ఢిల్లీలో డీ కాక్, జేపీ డుమినీ, ఐయ్యర్, సంజూ శ్యాంసన్లు కీలకం కానున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement