ఢిల్లీ ప్రతీకార విజయం.. | Delhi Dare Devils Won BY Four Runs | Sakshi
Sakshi News home page

ఢిల్లీ ప్రతీకార విజయం..

May 3 2018 12:59 AM | Updated on May 3 2018 2:22 PM

Delhi Dare Devils Won BY Four Runs - Sakshi

న్యూఢిల్లీ : జోస్‌ బట్లర్‌ 67(26 బంతుల్లో 4 ఫోర్లు, 7 సిక్స్‌లు), డీఆర్కీషార్ట్‌ 44(26 బంతుల్లో 2ఫోర్లు, 4 సిక్స్‌లు)లు వీరోచితంగా ఆడినా రాజస్తాన్‌ రాయల్స్‌ ఓటమిని చవిచూసింది. ఢిల్లీ 4 పరుగుల తేడాతో విజయం సాధించి ప్రతీకారం తీర్చుకుంది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఢిల్లీ రిషబ్‌ పంత్‌ 69(29 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్స్‌లు), శ్రేయస్‌ అయ్యర్‌ 50(35 బంతుల్లో 3 ఫోర్లు,3 సిక్స్‌లు), పృథ్వీషా 47(25 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లు)లు చెలరేగడంతో 17.1 ఓవర్లకు 6 వికెట్లు నష్టపోయి 196 పరుగులు చేసింది. ఈ సమయంలో వర్షం అంతరాయం కలిగించడంతో అంపైర్లు డక్‌వర్త్‌ లూయిస్‌ ప్రకారం రాజస్తాన్‌ లక్ష్యాన్ని 12 ఓవర్లకు 151 పరుగులుగా నిర్ధేశించింది. 

ఈ లక్ష్యఛేదనలో రాజస్తాన్‌ అనూహ్యంగా జోస్‌ బట్లర్‌ను ఓపెనర్‌గా పంపింది. బట్లర్‌, డీఆర్కీషార్ట్‌తో కలిసి ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన బ్యాట్స్‌మెన్‌ దూకుడుగా ఆడే క్రమంలో వరుసగా పెవిలియన్‌ బాట పట్టారు. నిర్ణీత ఓవర్లలో రాజస్తాన్‌ రాయల్స్‌ 5వికెట్లు కోల్పోయి 146 పరుగులే చేసింది. ఢిల్లీ బౌలర్లలో బౌల్ట్‌ రెండు వికెట్లు.. అమిత్‌ మిశ్రా, మ్యాక్స్‌వెల్‌లకు చెరో వికెట్‌ దక్కాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement