చహల్‌ను టీజ్‌ చేసిన మహిళా క్రికెటర్‌ | Danielle Wyatt Teases Yuzvendra Chahal | Sakshi
Sakshi News home page

చహల్‌ను టీజ్‌ చేసిన మహిళా క్రికెటర్‌

Dec 17 2019 2:14 PM | Updated on Dec 17 2019 2:54 PM

Danielle Wyatt Teases Yuzvendra Chahal - Sakshi

లండన్‌:  సోషల్‌ మీడియాలో భారత క్రికెటర్లు చేసే పోస్ట్‌లకు ఎ‍క్కువగా స్పందించే మహిళా క్రికెటర్‌ ఎవరైనా ఉన్నారంటే అది ఇంగ్లండ్‌కు చెందిన డానియెల్లి యాట్‌ మాత్రమే. విరాట్‌ కోహ్లి, ఎంఎస్‌ ధోనిల పోస్ట్‌లకు యాట్‌ సరదాగా రిప్లై ఇస్తూ భారత క్రికెటర్లపై ప్రేమను చాటుకుంటూ ఉంటారు. ఇటీవల జస్‌ప్రీత్‌ బుమ్రా జిమ్‌ చేస్తున్న ఫొటోను ఒకటి పోస్ట్‌ చేయగా, దానికి చిన్న పిల్లల ఎక్సర్‌సైజ్‌లు చేస్తున్నావేంటి అంటూ యాట్‌ ఆట పట్టించారు. తాజాగా భారత స్పిన్నర్‌ యజేంద్ర చహల్‌ చేసిన ఒక పోస్ట్‌కు సైతం అదే తరహాలో స్పందించారు యాట్‌. 

వెస్టిండీస్‌తో చెన్నైలో జరిగిన తొలి వన్డే తర్వాత కుల్దీప్‌ యాదవ్‌తో కలిసి దిగిన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌లో చహల్‌ పోస్ట్‌ చేశారు. ఇక్కడ చహల్‌-కుల్దీప్‌లు తమ ఎత్తు చూసుకుంటూ ఉన్న ఫొటోను పోస్ట్‌ చేశాడు. దాన్నే ఉద్దేశిస్తూ యాట్‌ కామెంట్‌ చేశారు. ‘ నా కంటే కూడా నువ్వే తక్కువ ఎత్తు’ అని టీజ్‌  చేసిన యాట్‌.. అందుకు లాఫింగ్‌ ఎమోజీని జత చేశారు.

వెస్టిండీస్‌తో జరిగిన తొలి వన్డే మ్యాచ్‌కు కుల్దీప్‌ యాదవ్‌కు చోటు దక్కగా, చహల్‌కు అవకాశం దక్కలేదు. ఈ మ్యాచ్‌లో భారత్‌ ఎనిమిది వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. భారత్‌ నిర్దేశించిన 288 పరుగుల టార్గెట్‌ను విండీస్‌ 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. హెట్‌మెయిర్‌, షాయ్‌ హోప్‌లు సెంచరీలతో కదం తొక్కి విండీస్‌ విజయంలో కీలక పాత్ర పోషించారు.  దాంతో మూడు వన్డేల సిరీస్‌లో విండీస్‌ 1-0 ఆధిక్యంలో నిలిచింది. రెండో వన్డే విశాఖలో బుధవారం జరుగనుంది.

Advertisement
 
Advertisement
Advertisement