ధోని హెయిర్‌ స్టైల్‌కు మహిళా క్రికెటర్‌ ఫిదా! | Danielle Wyatt Publicly Complimenting MS Dhoni | Sakshi
Sakshi News home page

Apr 27 2018 5:53 PM | Updated on Apr 27 2018 5:54 PM

Danielle Wyatt Publicly Complimenting MS Dhoni - Sakshi

ధోని న్యూలుక్‌

బెంగళూరు : టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లిని పెళ్లి చేసుకోమంటూ వార్తల్లో నిలిచిన ఇంగ్లండ్‌ క్రికెటర్‌ డానియెల్లి వ్యాట్‌.. ఇప్పుడు మహేంద్ర సింగ్‌ ధోని హెయిర్‌స్టైల్‌ సూపర్‌ అని ట్వీట్‌ చేసింది. ఈ ట్వీట్‌పై నెటిజన్లు వినూత్నంగా స్పందిస్తున్నారు. గత బుధవారం జరిగిన బెంగళూరు-చెన్నై మ్యాచ్‌లో ధోని వినూత్న హెయిర్‌ స్టైల్‌తో కనిపించాడు. ఈ హెయిర్‌ స్టైల్‌కు ఫిదా అయిన డానియెల్లి ‘ధోని హెయిర్‌ కట్‌ అయితే.. సూపర్‌’ అని ట్వీట్‌ చేసింది.

ఈ ట్వీట్‌కు ఓ అభిమాని  ‘ఈ దిగ్గజ క్రికెటర్‌ దగ్గర కొన్ని టిప్స్‌ తీసుకో’ అని బదులిచ్చాడు. దీనికి డానియెల్లి స్పందిస్తూ.. ‘నా హెలిక్యాప్టర్‌ షాట్‌ ఎంత దూరం వెళ్తుందో నేను ఖచ్చితంగా చెప్పలేను’ అని సరదాగా బదులిచ్చింది. దీనికి చాలా దూరం వెళ్తుందని.. కొందరంటే.. మా కింగ్‌ ధోనిని తదేకంగా చూడకు అని మరి కొందరు కామెంట్‌ చేస్తున్నారు. బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో ధోని అద్భుత ఇన్నింగ్స్‌తో చెన్నై విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇటీవల వన్డే ట్రై సిరీస్‌ కోసం భారత్‌కు వచ్చిన డానియెల్లీ భారత మహిళల జట్టుపై సెంచరీ సాధించింది.

Advertisement
 
Advertisement
Advertisement