క్వార్టర్స్‌లో సిరిల్‌ వర్మ | Cyril Verma enter to quarters | Sakshi
Sakshi News home page

క్వార్టర్స్‌లో సిరిల్‌ వర్మ

Feb 5 2017 11:48 PM | Updated on Sep 5 2017 2:58 AM

జాతీయ సీనియర్‌ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ ప్లేయర్‌ సిరిల్‌ వర్మ క్వార్టర్‌ ఫైనల్లోకి దూసుకెళ్లాడు.

పట్నా: జాతీయ సీనియర్‌ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ ప్లేయర్‌ సిరిల్‌ వర్మ క్వార్టర్‌ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్లో సిరిల్‌ వర్మ 21–19, 21–14తో పదో సీడ్‌ బోధిత్‌ జోషి (ఉత్తరాఖండ్‌)పై గెలుపొందాడు. అంతకుముందు మూడో రౌండ్‌లో సిరిల్‌ 24–22, 21–10తో నీరజ్‌ వశిష్ట్‌ (రైల్వేస్‌)ను ఓడించాడు.

తెలంగాణకే చెందిన రాహుల్‌ యాదవ్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్లో 21–17, 21–23, 11–21తో డానియల్‌ ఫరీద్‌ (కర్ణాటక) చేతిలో ఓడిపోయాడు. మహిళల సింగిల్స్‌ విభాగంలో తెలుగు అమ్మాయిలు శ్రీకృష్ణప్రియ, ప్రమద, సాయి ఉత్తేజిత రావు మూడో రౌండ్‌లో పరాజయం పాలయ్యారు.  

 

Advertisement
 
Advertisement
Advertisement