
మెల్‌బోర్న్: తాను స్వలింగ సంపర్కుడిని కాదని ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ జేమ్స్ ఫాల్క్‌నర్ వివరణ ఇచ్చాడు. సోమవారం తన 29వ పుట్టిన రోజు సందర్భంగా తల్లి రోస్లిన్ ఫాల్క్‌నర్‌తో పాటు రాబర్ట్ జబ్ అనే యువకుడితో కలిసి ఫాల్క్‌నర్ డిన్నర్ పార్టీలో పాల్గొన్నాడు.
ఈ సందర్భంగా తీసిన ఫొటోను ‘బాయ్ ఫ్రెండ్‌తో’ డిన్నర్ అంటూ పోస్ట్ చేశాడు. దీంతో అతడు ‘గే’ అంటూ వార్తలు వచ్చాయి. మంగళవారం ఫాల్క్‌నర్ వీటిని ఖండించాడు. రాబర్ట్ జబ్ స్నేహితుడని, ఐదేళ్లుగా ఒకే గదిలో ఉంటున్నామని స్పష్టం చేశాడు. దీనిపై తాము కూడా పొరపాటు పడ్డామని, ఫాల్క్‌నర్‌ను క్షమాపణలు కోరుతున్నామని క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) కూడా పేర్కొనడం గమనార్హం.