త్వరలో పెళ్లి కొడుకు కానున్న హర్భజన్ | Cricketer Harbhajan Singh to marry actor Geeta Basra in October | Sakshi
Sakshi News home page

త్వరలో పెళ్లి కొడుకు కానున్న హర్భజన్

Aug 22 2015 2:35 PM | Updated on Sep 3 2017 7:56 AM

త్వరలో పెళ్లి కొడుకు కానున్న హర్భజన్

త్వరలో పెళ్లి కొడుకు కానున్న హర్భజన్

: టీమిండియా ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ త్వరలో ఇంటివాడు కానున్నాడు. తన స్నేహితురాలు, మోడల్ గీతా బస్రాతో హర్భజన్ ఏడు అడుగులు వేయనున్నాడు.

ముంబై: టీమిండియా ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ త్వరలో ఇంటివాడు కానున్నాడు. తన స్నేహితురాలు, మోడల్ గీతా బస్రాతో హర్భజన్ ఏడు అడుగులు వేయనున్నాడు. ఇటీవల హర్భజన్ పెళ్లి మూహూర్తాన్ని ఖరారు చేసినట్లు అతని కుటుంబ సభ్యుడు  ధృవీకరించాడు. అక్టోబర్ 29 వ తేదీన హర్భజన్-గీతాల పెళ్లి జరుగనున్నట్లు తెలిపాడు. ఇందుకు పంజాబ్ రాష్ట్రంలోని ఫాగ్వారాలో హోటల్ క్లబ్ కెబనాను బుక్ చేశామని.. ఒకవేళ అక్టోబర్ నెలలో దక్షిణాఫ్రికాలో పర్యటించనున్న టీమిండియా టీమ్ లో హర్భజన్ ఎంపికైతే తేదీల్లో స్వల్ప మార్పులు ఉండే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నాడు.

ఇదిలా ఉండగా హర్భజన్ పెళ్లి తేదీకి సంబంధించి ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని అతని కజిన్ తెలిపాడు. శ్రీలంక టూర్ లో ఉన్న హర్భజన్ ఇండియాకు తిరిగొచ్చిన తరువాతే తేదీపై నిర్ణయం తీసుకుంటామన్నాడు. కాగా, ఇప్పటికే ఆ పెళ్లి వేడుకకు సంబంధించి క్లబ్ కెబెనాను బుక్ చేసుకున్నట్లు ఆ క్లబ్ సీనియర్ ఉద్యోగి తెలిపాడు.

Advertisement
 
Advertisement
Advertisement