కామన్వెల్త్ గేమ్స్ లో భారత్ హాకీ శుభారంభం | Commonwealth Games: India men's hockey team opens account | Sakshi
Sakshi News home page

కామన్వెల్త్ గేమ్స్ లో భారత్ హాకీ శుభారంభం

Jul 25 2014 3:54 PM | Updated on Sep 2 2017 10:52 AM

కామన్వెల్త్ గేమ్స్లో భారత పురుషుల హాకీ జట్టు శుభారంభం చేసింది.

గ్లాస్కో: కామన్వెల్త్ గేమ్స్లో భారత పురుషుల హాకీ జట్టు శుభారంభం చేసింది. పూల్-ఎలో భాగంగా శుక్రవారం జరిగిన మ్యాచ్లో భారత్ 3-1తో లౌలీ వేల్స్పై అలవోకగా విజయం సాధించింది.

మ్యాచ్ ప్రథమార్ధంలో ఇరు జట్లు ఒక్కో గోల్ మాత్రమే చేశాయి. దీంతో స్కోరు 1-1తో సమమైంది. అయితే ద్వితీయార్ధంలో భారత ఆటగాళ్లు విజృంభించారు. రెండు గోల్స్ చేసి జట్టుకు విజయాన్నందించారు. భారత జట్టులో రఘునాథ్, ఆర్ సింగ్, గుర్వీందర్ సింగ్ ఒక్కో గోల్ చేశారు.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement