మోరిస్ మోత మోగించాడు! | chris morris record highest strike rate in IPL-10 | Sakshi
Sakshi News home page

మోరిస్ మోత మోగించాడు!

Apr 12 2017 2:45 PM | Updated on Sep 5 2017 8:36 AM

మోరిస్ మోత మోగించాడు!

మోరిస్ మోత మోగించాడు!

ఢిల్లీ డేర్ డెవిల్స్ బ్యాట్స్ మన్ క్రిస్ మోరిస్ ఐపీఎల్-10లో అభిమానులకు అసలుసిసలు మజా అందించాడు.

పుణె: ఢిల్లీ డేర్ డెవిల్స్ బ్యాట్స్ మన్ క్రిస్ మోరిస్ ఐపీఎల్-10లో అభిమానులకు అసలుసిసలు మజా అందించాడు. పుణెతో మంగళవారం జరిగిన మ్యాచ్ లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 9 బంతుల్లోనే 39 పరుగులు బాదాడు. మోరిస్ విజృంభణతో డేర్ డెవిల్స్ ఐపీఎల్ చరిత్రలో మూడో అత్యధిక స్కోరు సాధించింది.

వీర బాదుడుతో మోరిస్ మరో ఘనత సొంతం చేసుకున్నాడు. సునామీ ఇన్నింగ్స్ తో అత్యధిక స్ట్రైక్ రేటు సాధించిన ఆటగాడిగా నిలిచాడు. నిన్నటి మ్యాచ్ లో అతడి బ్యాటింగ్ స్ట్రైక్ రేటు 422.22గా నమోదు కావడం విశేషం. ఐపీఎల్ లో ఇదే అత్యుత్తమ స్ట్రైక్ రేటు. ఇంతకుముందు ఈ రికార్డు అల్బీ మోర్కల్ పేరిట ఉండేది. 2012లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు మోర్కల్ 400 స్ట్రైక్ రేటుతో 7 బంతుల్లో 28 పరుగులు సాధించాడు.

మోరిస్ విజృంభణతో అతడి రికార్డు తుడిచిపెట్టుకుపోయింది. సంజూ శామ్సన్, మోరిస్ చెలరేగడంతో చివరి 4 ఓవర్లలో డేర్ డెవిల్స్ 76 పరుగులు సాధించింది. ఇది కూడా మూడో అత్యుత్తమ ప్రదర్శనగా నమోదైంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement