breaking news
strike rate
-
మోరిస్ మోత మోగించాడు!
పుణె: ఢిల్లీ డేర్ డెవిల్స్ బ్యాట్స్ మన్ క్రిస్ మోరిస్ ఐపీఎల్-10లో అభిమానులకు అసలుసిసలు మజా అందించాడు. పుణెతో మంగళవారం జరిగిన మ్యాచ్ లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 9 బంతుల్లోనే 39 పరుగులు బాదాడు. మోరిస్ విజృంభణతో డేర్ డెవిల్స్ ఐపీఎల్ చరిత్రలో మూడో అత్యధిక స్కోరు సాధించింది. వీర బాదుడుతో మోరిస్ మరో ఘనత సొంతం చేసుకున్నాడు. సునామీ ఇన్నింగ్స్ తో అత్యధిక స్ట్రైక్ రేటు సాధించిన ఆటగాడిగా నిలిచాడు. నిన్నటి మ్యాచ్ లో అతడి బ్యాటింగ్ స్ట్రైక్ రేటు 422.22గా నమోదు కావడం విశేషం. ఐపీఎల్ లో ఇదే అత్యుత్తమ స్ట్రైక్ రేటు. ఇంతకుముందు ఈ రికార్డు అల్బీ మోర్కల్ పేరిట ఉండేది. 2012లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు మోర్కల్ 400 స్ట్రైక్ రేటుతో 7 బంతుల్లో 28 పరుగులు సాధించాడు. మోరిస్ విజృంభణతో అతడి రికార్డు తుడిచిపెట్టుకుపోయింది. సంజూ శామ్సన్, మోరిస్ చెలరేగడంతో చివరి 4 ఓవర్లలో డేర్ డెవిల్స్ 76 పరుగులు సాధించింది. ఇది కూడా మూడో అత్యుత్తమ ప్రదర్శనగా నమోదైంది. -
మహేంద్ర సింగ్ ధోనీ@333.3
ఢాకా: భారత కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీలో మునుపటి వాడి తగ్గిందన్న విమర్శలకు బ్యాట్‌తోనే సమాధానం చెప్పాడు. ఆసియా కప్ ఫైనల్లో మరోసారి బెస్ట్ మ్యాచ్ ఫినిషర్ అవతారమెత్తి భారత్‌కు కప్ అందించాడు. బంగ్లాదేశ్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో టీమిండియా 8 వికెట్లతో ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ఆరే బంతులాడిన ధోనీ ఫోర్, 2 సిక్సర్లతో 20 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ధోనీ స్ట్రయిక్ రేట్ 333.3. టి-20 ఫార్మాట్లో మహీ కనీసం ఆరుబంతులు ఆడినపుడు ఇదే అత్యధిక స్ట్రయిక్ రేట్. ఈ మ్యాచ్ విశేషాలు.. అంతర్జాతీయ క్రికెట్లో ధోనీ మొత్తం 202 సిక్సర్లు బాదాడు. టెస్టుల్లో 78, వన్డేల్లో 192, టి-20ల్లో 32 సిక్సర్లు సంధించాడు. అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాళ్ల ఆల్‌టైమ్ జాబితాలో ధోనీ ఐదో స్థానంలో నిలిచాడు. అఫ్రిదీ, క్రిస్ గేల్, బ్రెండన్ మెకల్లమ్, జయసూర్య తర్వాతి స్థానంలో నిలిచాడు. ఈ మ్యాచ్‌లో శిఖర్ ధవన్ చేసిన 60 పరుగులే టి-20 ఫార్మాట్లో అతనికిది అత్యధిక వ్యక్తిగత స్కోరు. 2014 నుంచి పొట్టి క్రికెట్లో టీమిండియా గెలుపోటముల రికార్డు 16-6. అంతర్జాతీయ టి-20ల్లో భారత్‌కిది వరుసగా ఏడో విజయం. భారత్ చివరిసారి శ్రీలంకతో పుణె మ్యాచ్‌లో ఓడింది.