అందుకు క్రిస్‌ గేల్‌ కారణం: రసెల్‌

Chris Gayles Advice Of Using Bigger Bats Has Helped Me, Russell - Sakshi

కోల్‌కతా: ఈ ఐపీఎల్‌ సీజన్‌లో బంతిని బలంగా బాదుతూ అభిమానులకు ఎక్కువ వినోదాన్ని పంచుతున్న క్రికెటర్లలో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఆటగాడు ఆండ్రీ రసెల్‌ ఒకడు. ప్రస్తుత ఐపీఎల్‌లో ఇప్పటివరకూ ఆడిన మ్యాచ్‌ల ప్రకారం చూస్తే రసెల్‌ 217.00  స్ట్రైక్‌రేట్‌తో అందరి కంటే ముందున్నాడు.  సుమారు 66.00 సగటుతో 392 పరుగులు చేశాడు. ఇప్పటివరకే రసెల్‌ 41 సిక్సర్లు బాదాడు. అయితే తన హార్డ్‌ హిట్టింగ్‌ వెనుకాల ఒక వ్యక్తి ఉన్నాడంటూ రసెల్‌ తాజాగా బయటపెట్టాడు. తమ దేశానికి చెందిన క్రిస్‌ గేల్‌ సలహాతోనే భారీ షాట్లను అవలీలగా ఆడుతున్నానని రసెల్‌ తెలిపాడు.

‘క్రిస్‌ గేల్‌ ఇచ్చిన సలహా నా జీవితాన్నే మార్చేసింది. సిక్సులు ఎలా కొట్టాలో గేల్‌ను చూసే నేర్చుకున్నా. ఇంతకు ముందు చాలా తేలికైన బ్యాట్లు వాడేవాడిని. గత టీ20 ప్రపంచకప్‌లో డ్రెస్సింగ్‌ రూమ్‌లో ఉన్న సమయంలో గేల్‌ నా దగ్గరికి వచ్చి.. ‘నువ్వు బరువైన బ్యాటు ఎందుకు వాడవు.. ఆ బ్యాటుతో సిక్సర్లు సులభంగా కొట్టవచ్చు’ అని సలహా ఇచ్చాడు. ఆ సలహాను నేను అమలు చేసినప్పటి నుంచి నా బ్యాటింగ్‌ తీరే మారిపోయింది. అదే టీ20 ప్రపంచకప్‌ సెమీఫైనల్‌లో 48 పరుగులు చేశాను. అప్పటి నుంచి నేను చూస్తుండగానే నా దశ తిరిగింది. ప్రస్తుతం మిగతా బ్యాట్స్‌మెన్ బ్యాట్ల కంటే నా బ్యాట్‌ బరువెక్కువ. అదే నా సక్సెస్‌కు కారణం’ అని రసెల్‌ తెలిపాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top