టెస్టు ర్యాకింగ్ లో పుజారాకు 5వ స్థానం | Cheteshwar Pujara moves up in ICC Test rankings | Sakshi
Sakshi News home page

టెస్టు ర్యాకింగ్ లో పుజారాకు 5వ స్థానం

Jan 6 2014 3:39 PM | Updated on Sep 2 2017 2:21 AM

టెస్టు ర్యాకింగ్ లో పుజారాకు 5వ స్థానం

టెస్టు ర్యాకింగ్ లో పుజారాకు 5వ స్థానం

భారత ఆటగాడు చటేశ్వర్‌ పుజారా టెస్ట్‌ ర్యాంకుల్లో ఐదో స్థానానికి దూసుకొచ్చాడు

దుబాయ్: భారత ఆటగాడు చటేశ్వర్‌ పుజారా టెస్ట్‌ ర్యాంకుల్లో ఐదో స్థానానికి దూసుకొచ్చాడు. సౌతాఫ్రికాలో నిలకడగా రాణించిన పుజారా.. రెండు ర్యాంకులు పైకి ఎగబాకి తన స్థానాన్ని మరింత మెరుగుపరుచుకున్నాడు. ప్రస్తుతం పుజారా 851 పాయింట్లతో టాప్‌ టెన్‌లో ఉన్న ఏకైక భారత బ్యాట్స్‌మన్‌గా కొనసాగుతున్నాడు. కాగా, విరాట్‌ కోహ్లి మాత్రం ఒక స్థానం కోల్పోయి 11వ స్థానానికి పడిపోయాడు. బౌలింగ్‌ లిస్ట్‌లో ఏడో ర్యాంక్‌లో ఉన్న టీమిండియా స్పిన్నర్‌ అశ్విన్.. ఆల్‌రౌండర్ల లిస్ట్‌లో టాప్‌ ప్లేస్‌లో కొనసాగుతున్నాడు. బ్యాట్స్‌మెన్‌ లిస్ట్‌లో డివిలియర్స్‌ తొలి స్థానంలో కొనసాగుతుండగా.. చంద్రపాల్‌, రాస్‌ టేలర్‌ తర్వాతి రెండు స్థానాల్లో ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement