హారికకు మూడో విజయం | chess palyer harika win a third game | Sakshi
Sakshi News home page

హారికకు మూడో విజయం

Oct 6 2016 12:44 AM | Updated on Sep 4 2017 4:17 PM

ఐల్ ఆఫ్ మ్యాన్ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్‌లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక మూడో విజయాన్ని నమోదు

న్యూఢిల్లీ: ఐల్ ఆఫ్ మ్యాన్ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్‌లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక మూడో విజయాన్ని నమోదు చేసింది. గ్రాంట్ అరాఖమియా (స్కాట్లాండ్)తో బుధవారం జరిగిన ఐదో రౌండ్‌లో హారిక 30 ఎత్తుల్లో గెలిచింది. ప్రస్తుతం  హారిక ఖాతాలో 3.5 పారుుంట్లు ఉన్నారుు.

 మరోవైపు మాస్కోలో జరుగుతున్న తాల్ స్మారక చెస్ టోర్నమెంట్‌లో భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ ఖాతాలో ఐదో ‘డ్రా’ చేరింది. ఇయాన్ నెపోమ్‌నియాచి (రష్యా)తో జరిగిన ఎనిమిదో రౌండ్ గేమ్‌ను ఆనంద్ 29 ఎత్తుల్లో ‘డ్రా’ చేశాడు. ఎనిమిదో రౌండ్ తర్వాత ఆనంద్ 4.5 పారుుంట్లతో మూడో స్థానంలో ఉన్నాడు.
 

Advertisement
 
Advertisement
Advertisement