చెన్నై స్మాషర్స్‌ గెలుపు | Chennai Smashers beat Pune 7 Aces | Sakshi
Sakshi News home page

చెన్నై స్మాషర్స్‌ గెలుపు

Jan 4 2019 3:02 AM | Updated on Jan 4 2019 3:02 AM

 Chennai Smashers beat Pune 7 Aces - Sakshi

అహ్మదాబాద్‌: ప్రీమియర్‌ బ్యాడ్మింటన్‌ లీగ్‌లో చెన్నై స్మాషర్స్‌ 4–3తో పుణే సెవెన్‌ ఏసెస్‌పై గెలిచింది. మిక్స్‌డ్‌ డబుల్స్‌ చెన్నై ట్రంప్‌ మ్యాచ్‌లో క్రిస్‌ అడ్‌కాక్‌–గ్యాబ్రియెల్‌ జంట 15–13, 15–14తో ఇవనోవ్‌–జాయెర్స్‌ఫెల్డ్‌ (పుణే) జోడీపై నెగ్గింది. పురుషుల సింగిల్స్‌లో రాజీవ్‌ ఉసెఫ్‌ (చెన్నై) 15–6, 8–15, 15–13తో లెవెర్డెజ్‌ (పుణే)ను ఓడించగా, మహిళల సింగిల్స్‌లో సంగ్‌ జి హ్యున్‌ (చెన్నై) 15–14, 7–15, 15–13తో మారిన్‌ (పుణే)కు షాకిచ్చింది.  పురుషుల సింగిల్స్‌ రెండో మ్యాచ్‌లో అజయ్‌ జయరామ్‌ (పుణే) 13–15, 15–7, 15–11తో వీ ఫెంగ్‌ చోంగ్‌పై నెగ్గాడు. పుణే ట్రంప్‌ అయిన పురుషుల డబుల్స్‌లో ఇవనోవ్‌–చిరాగ్‌ శెట్టి జోడీ 15–14, 15–9తో క్రిస్‌ అడ్‌కాక్‌–సుమిత్‌ రెడ్డి (చెన్నై) జంటపై గెలుపొందింది. నేటి మ్యాచ్‌లో అహ్మదాబాద్‌ స్మాష్‌మాస్టర్స్‌తో అవధ్‌ వారియర్స్‌ పోటీపడుతుంది.   

Advertisement
 
Advertisement
Advertisement