చండిమల్ సెంచరీ | Chandimal 138 runs help to srilanka 338 in first innigs | Sakshi
Sakshi News home page

చండిమల్ సెంచరీ

Mar 16 2017 12:36 PM | Updated on Nov 9 2018 6:43 PM

చండిమల్ సెంచరీ - Sakshi

చండిమల్ సెంచరీ

బంగ్లాదేశ్ తో జరుగుతున్న రెండో టెస్టులో శ్రీలంక తన తొలి ఇన్నింగ్స్ లో 338 పరుగుల వద్ద ఆలౌటైంది.

కొలంబో: బంగ్లాదేశ్ తో జరుగుతున్న రెండో టెస్టులో శ్రీలంక తన తొలి ఇన్నింగ్స్ లో 338 పరుగుల వద్ద ఆలౌటైంది. 238/7 ఓవర్ నైట్ స్కోరుతో గురువారం ఇన్నింగ్స్ కొనసాగించిన లంకేయులు సరిగ్గా మరో 100 పరుగులు చేసి మిగతా మూడు వికెట్లను కోల్పోయారు. ఓవర్ నైట్ ఆటగాడు చండిమల్(138; 300 బంతుల్లో 10 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీ చేయడంతో లంక గౌరవప్రదమైన స్కోరును సాధించింది.

 

హెరాత్ తో కలిసి 55 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించిన చండిమల్.. లక్మల్ తో కలిసి మరో 55 పరుగుల్ని జత చేశాడు. దాంతో లంకేయులు మూడొందల మార్కును చేరారు. బంగ్లాదేశ్ బౌలర్లలో మెహది హసన్ మిరజ్ మూడు వికెట్లు సాధించగా,ముస్తఫిజుర్ రెహ్మాన్, సుభాశిస్ రాయ్,షకిబుల్ హసన్ లకు తలో రెండు వికెట్లు లభించాయి.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement