చాంపియన్స్ లీగ్ టీ-20లో భాగంగా ఆదివారం జరిగిన మ్యాచ్లో కింగ్స్ లెవెన్ పంజాబ్ ఏడు వికెట్లతో కేప్ కోబ్రాస్పై ఘనవిజయం సాధించింది.
మొహాలీ: చాంపియన్స్ లీగ్ టీ-20లో భాగంగా ఆదివారం జరిగిన మ్యాచ్లో కింగ్స్ లెవెన్ పంజాబ్ ఏడు వికెట్లతో కేప్ కోబ్రాస్పై ఘనవిజయం సాధించింది. 136 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన పంజాబ్ మరో 11 బంతులు మిగిలుండగా మూడు వికెట్ల నష్టానికి విజయతీరాలకు చేరింది. వృద్ధిమాన్ సాహా (42 నాటౌట్) టాప్ స్కోరర్.
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన కేప్ కోబ్రాస్ 18.3 ఓవర్లలో 135 పరుగులకు ఆలౌటైంది. లెవీ 42, ఆమ్లా 40 పరుగులు చేశారు. అనురీత్ సింగ్, అక్షర్ పటేల్ మూడేసి వికెట్లు పడగొట్టారు.