క్యాబ్‌ హెడ్‌ క్వార్టర్స్‌ మూసివేత

CAB Closed For 7 days After Eden Gardens Staff Tests Positive - Sakshi

కోల్‌కతా: నగరంలోని ఈడెన్‌ గార్డెన్‌ వేదికగా ఉన్న క్రికెట్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ బెంగాల్‌(క్యాబ్‌) హెడ్‌ క్వార్టర్‌ వారం రోజుల పాటు మూతబడనుంది. ఈడెన్‌ గార్డెన్‌లోని సిబ్బందిలో ఒకరికి కరోనా వైరస్‌ సోక​డంతో క్యాబ్‌ ఆఫీస్‌ను ఆదివారం మూసేశారు. సుమారు వారం రోజుల పాటు క్యాబ్‌ హెడ్‌ క్వార్టర్‌కు తాళాలు వేయనున్నట్లు అధికారులు తెలిపారు.  కాగా, ఈడెన్‌ గార్డెన్‌లో కరోనా సోకిన వ్యక్తి తాత్కాలిక ఉద్యోగిగా తేలింది. సివిల్‌ ఇంజనీరింగ్‌ డిపార్ట్‌మెంట్‌లో చందదాస్‌ అనే అతను తాత్కాలిక సర్వీస్‌పై పని చేయడానికి రాగా కరోనా బారిన పడినట్లు క్యాబ్‌ ప్రెసిడెంట్‌ అవిషేక్‌ దాల్మియా తెలిపారు. (‘గంగూలీ అంటే అసహ్యం పుట్టేది’)

అతన్ని చార్నోక్‌ ఆస్పత్రిలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. అతనితో సాన్నిహిత్యంగా మెలిగిన వారిని సైతం కరోనా పరీక్షలు చేయిస్తున్నారు. ముందు వీరంతా హోమ్‌ క్వారంటైన్‌కు వెళ్లగా కరోనా టెస్టులు చేయనున్నారు. మొత్తం ఆఫీస్‌ను శానిటైజ్‌ చేయనున్నట్లు అవిషేక్‌ దాల్మియా తెలిపారు. పశ్చిమ బెంగాల్‌లో శనివారం రికార్డు స్థాయిలో 743 కేసులు నమోదు కాగా, కోల్‌కతాలో నగరంలో 242లో కోవిడ్‌-19 కేసులు నమోదయ్యాయి.  ఇప్పటివరకూ దాదాపు ఏడువేల కేసులు పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రంలో నమోదయ్యాయి. (నీ బుగ్గలు ఇష్టం.. వాటిని పట్టుకోనా?)

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top