22 బంతుల్లో మెక్ కల్లమ్ అర్ధసెంచరీ | Brendon McCullum beats half century | Sakshi
Sakshi News home page

22 బంతుల్లో మెక్ కల్లమ్ అర్ధసెంచరీ

Mar 24 2015 12:21 PM | Updated on Sep 2 2017 11:19 PM

22 బంతుల్లో మెక్ కల్లమ్ అర్ధసెంచరీ

22 బంతుల్లో మెక్ కల్లమ్ అర్ధసెంచరీ

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న ప్రపంచకప్ సెమీస్ ఫైనల్ మ్యాచ్ లో న్యూజిలాండ్ డాషింగ్ ఓపెనర్ బ్రెండన్ మెక్ కల్లమ్ విజృంభించాడు.

ఆక్లాండ్: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న ప్రపంచకప్ సెమీస్ ఫైనల్ మ్యాచ్ లో న్యూజిలాండ్ డాషింగ్ ఓపెనర్ బ్రెండన్ మెక్ కల్లమ్ విజృంభించాడు. 22 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో అర్ధ సెంచరీ బాదాడు. వన్డేల్లో అతడికి 31 హాఫ్ సెంచరీ కాగా, ఈ టోర్నమెంట్లో నాల్గోది.

కివీస్ 8 ఓవర్లలో 77/1 స్కోరుతో ఆట కొనసాగిస్తోంది. 59 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద మెక్ కల్లమ్ అవుటయ్యాడు. మోర్కల్ బౌలింగ్ లో స్టెయిన్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో కివీస్ జోరు తగ్గింది. గప్టిల్(6), విలియమ్సన్(2) క్రీజ్ లో ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement