బాక్సర్‌ ఘనీచాంద్‌ మృతి

Boxer Ghanichand Dies at 74 - Sakshi

హైదరాబాద్‌: జాతీయ మాజీ బాక్సింగ్‌ చాంపియన్, సర్వీసెస్‌ సీనియర్‌ విభాగం బాక్సింగ్‌ చాంపియన్‌ ఎస్‌ఏ ఘనీచాంద్‌ (74) గురువారం రాత్రి కన్నుమూశారు. రక్షణశాఖలో వివిధ హోదాలలో పని చేసిన ఆయన వరుసగా 17 సంవత్సరాలు సర్వీసెస్‌కు ప్రాతినిధ్యం వహించి, 8 సార్లు జాతీయ చాంపియన్‌గా నిలిచాడు. ఉద్యోగం నుంచి రిటైర్‌ అయిన తరువాత ఆయన గోల్కొండ బాక్సింగ్‌ అసోసియేషన్‌ స్థాపించి యువకులకు బాక్సింగ్‌లో శిక్షణ ఇచ్చారు.

ఇతని కుమారుడు ఎజాజ్‌  తెలంగాణ చాంపియన్‌ షిప్‌ను గెలుచుకున్నాడు. ఘనీ చాంద్‌ అంత్యక్రియలు శుక్రవారం మ«ధ్యాహ్నం జరిగాయి. కార్వాన్‌ ఎమ్మెల్యే కౌసర్‌ మొహియుద్దీన్‌ ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాపం వ్యక్తం చేశారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top