క్వార్టర్స్‌లో బోపన్న జోడీ  | Bopanna pair in Quarter final | Sakshi
Sakshi News home page

క్వార్టర్స్‌లో బోపన్న జోడీ 

Apr 20 2018 1:40 AM | Updated on Apr 20 2018 1:40 AM

Bopanna pair in Quarter final - Sakshi

క్లే కోర్టు సీజన్‌ తొలి మాస్టర్స్‌ సిరీస్‌ టోర్నమెంట్‌ మోంటెకార్లో ఓపెన్‌లో భారత డబుల్స్‌ నంబర్‌వన్‌ రోహన్‌ బోపన్న–రోజర్‌ వాసెలిన్‌ (నెదర్లాండ్స్‌) జంట క్వార్టర్‌ ఫైనల్‌కు చేరింది. మొనాకోలోని మోంటెకార్లోలో జరుగుతున్న ఈ టోర్నీ ప్రిక్వార్టర్స్‌లో బోపన్న జోడీ 3–6, 6–4, 11–9తో ఏడో సీడ్‌ జేమీ ముర్రే (బ్రిటన్‌)–బ్రూనో సోరెస్‌ (బ్రెజిల్‌)ద్వయంపై విజయం సాధించింది. క్వార్టర్స్‌లో జాన్‌ సెబాస్టియన్‌–రాబర్ట్‌ ఫరాతో బోపన్న జంట తలపడనుంది.   

Advertisement
 
Advertisement
Advertisement