‘కామన్వెల్త్’కు బోల్ట్ | Bolt named in Jamaican Games squad | Sakshi
Sakshi News home page

‘కామన్వెల్త్’కు బోల్ట్

Jul 5 2014 1:15 AM | Updated on Sep 2 2017 9:48 AM

‘కామన్వెల్త్’కు బోల్ట్

‘కామన్వెల్త్’కు బోల్ట్

భారత్‌లో 2010లో జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌కు డుమ్మా కొట్టిన జమైకా స్టార్ స్ప్రింటర్ ఉసేన్ బోల్ట్ ఈసారి మాత్రం గ్లాస్గోలో జరిగే క్రీడల్లో పాల్గొంటున్నాడు.

కింగ్‌స్టన్: భారత్‌లో 2010లో జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌కు డుమ్మా కొట్టిన జమైకా స్టార్ స్ప్రింటర్ ఉసేన్ బోల్ట్ ఈసారి మాత్రం గ్లాస్గోలో జరిగే క్రీడల్లో పాల్గొంటున్నాడు. ఈ నెల 23 నుంచి జరిగే ఈ క్రీడల కోసం జమైకా ప్రకటించిన అథ్లెట్ల జాబితాలో బోల్ట్ పేరు ఉంది.
 
 అలాగే మరో స్టార్ స్ప్రింటర్ షెల్లీ ఆన్ ఫ్రేజర్ కూడా ఈ గేమ్స్‌లో పాల్గొంటుంది. అయితే ఈ ఇద్దరూ క్రీడలకు ముందు ఫిట్‌నెస్ నిరూపించుకోవాల్సి ఉంటుంది. ఇక బోల్ట్, షెల్లీ 100 మీటర్ల పరుగులో స్టార్స్ అయినప్పటికీ.. స్కాట్లాండ్‌లో 4x100 మీటర్ల రిలేలో పాల్గొనే అవకాశం ఉంది.
 

Advertisement
 
Advertisement
Advertisement