
ఐపీఎల్ ఫ్రాంచైజీ రాజస్తాన్ రాయల్స్ సారథిగా తనను నియమించడంతో ఎంతో ఉత్కంఠకు, ఉద్వేగానికి లోనయ్యానని భారత క్రికెటర్ అజింక్య రహానే అన్నాడు. మంగళవారం అతడు ఇక్కడ మీడియాకు ప్రకటన విడుదల చేశాడు. ‘ఈ జట్టును ఓ కుటుంబంలా భావిస్తా.
నాపై నమ్మకం ఉంచిన ఫ్రాంచైజీ యాజమాన్యానికి ధన్యవాదాలు. మా అత్యుత్తమ ఆటతీరు ప్రదర్శించేందుకు ప్రయత్నిస్తాం. రాబోయే సీజన్ కోసం ఎదురుచూస్తున్నాం. మా వెనుక నిలిచిన అభిమానులకు కూడా కృతజ్ఞతలు. వారి మద్దతు ఇకపైనా కొనసాగాలని కోరుకుంటున్నా’ అని రహానే పేర్కొన్నాడు.