చండిలాపై జీవితకాల నిషేధం! | BCCI summons Ajit Chandila, may face life ban | Sakshi
Sakshi News home page

చండిలాపై జీవితకాల నిషేధం!

Oct 5 2013 1:34 AM | Updated on Sep 1 2017 11:20 PM

ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కేసులో కీలక నిందితుడు, రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు అజిత్ చండిలాపై బీసీసీఐ జీవితకాల నిషేధం విధించే అవకాశం ఉంది. గతంలో శ్రీశాంత్ తదితరులపై నిషేధం విధించిన సమయంలో చండిలాపై బోర్డు విచారణ పూర్తి కాలేదు.

ముంబై: ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కేసులో కీలక నిందితుడు, రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు అజిత్ చండిలాపై బీసీసీఐ జీవితకాల నిషేధం విధించే అవకాశం ఉంది. గతంలో శ్రీశాంత్ తదితరులపై నిషేధం విధించిన సమయంలో చండిలాపై బోర్డు విచారణ పూర్తి కాలేదు.
 
 తాజాగా బీసీసీఐ అవినీతి నిరోధక విభాగం హెడ్ రవి సవానీ... చండిలాను కలిసి విచారణ జరిపారు. దాదాపు మూడు గంటల పాటు ఢిల్లీలో ఈ విచారణ జరిగింది. సవానీ నివేదిక ఇవ్వగానే బోర్డు చండిలాపై నిషేధం విధించే అవకాశం ఉంది. వారం రోజుల లోపే ఈ ప్రక్రియ పూర్తవుతుందని బోర్డు వర్గాలు తెలిపాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement