ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ప్రపంచ క్రికెట్‌ను నాశనం చేస్తోందన్న ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ ఇయాన్ బోథమ్ వ్యాఖ్యలపై బీసీసీఐ మండిపడింది.
ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ప్రపంచ క్రికెట్‌ను నాశనం చేస్తోందన్న ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ ఇయాన్ బోథమ్ వ్యాఖ్యలపై బీసీసీఐ మండిపడింది. ముందు వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని హితబోధ చేసింది. అన్ని జట్ల క్రికెటర్లు ఐపీఎల్‌కు బానిసలవుతున్నారని, ఆయా క్రికెట్ బోర్డులు కూడా లీగ్‌కు మద్దతు పలుకుతున్నాయని బోథమ్ ఆరోపించారు.
‘ఐపీఎల్‌లో ఆడేందుకు ఇతర బోర్డులు ఎందుకు అంగీకరించాయని ఆయన అడిగారు. ముందు బోథమ్ నిజాలు తెలుసుకోవాలి. విదేశీ ఆటగాళ్లను లీగ్‌లో ఆడేందుకు అనుమతించినందుకు మేం ఆయా బోర్డులకు పది వేల యూఎస్ డాలర్ల చొప్పున నష్టపరిహారం కింద చెల్లించాం. మాకు సూచనలు ఇచ్చేందుకు దిగ్గజ ఆటగాళ్లున్నారు. బోథమ్‌లాంటి వ్యక్తుల సలహాలు మాకు అక్కరలేదు’ అని బీసీసీఐ కార్యదర్శి సంజయ్ పటేల్ స్పష్టం చేశారు.