#మీటూ: బీసీసీఐ బాస్‌పై లైంగిక ఆరోపణలు | Sakshi
Sakshi News home page

Published Sat, Oct 13 2018 12:32 PM

BCCI CEO Rahul Johri Accused Of Sexual Harassment - Sakshi

ముంబై : మీటూ ఉద్యమ నేపథ్యంలో ఇప్పటి వరకు సినీ, మీడియా రంగాల్లోని ప్రముఖుల చీకటి వ్యవహారాలు బయటపడగా.. ఇప్పుడు ఆ సెగ క్రీడారంగానికి కూడా తగిలింది. రెండు రోజుల క్రితమే శ్రీలంక మాజీ కెప్టెన్‌ అర్జున రణతుంగ, స్టార్‌ బౌలర్‌ లసిత్‌ మలింగాలు తమతో అసభ్యంగా ప్రవర్తించారని బాధిత మహిళలు సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా భారత క్రికెట్‌ నియంత్ర మండలి (బీసీసీఐ) సీఈవో రాహుల్‌ జోహ్రి చీకటి కోణాన్ని ఓ మహిళా జర్నలిస్టు బయటపెట్టింది. తనను రాహుల్‌ జోహ్రి లైంగికంగా వేధించాడని, మంచిగా నటిస్తూ తనపట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడని ఆరోపిస్తూ ట్వీట్‌ చేశారు.

రాహుల్‌ తన మాజీ సహుద్యోగని, ఓ రోజు తమ జాబ్‌కు సంబంధించిన విషయాలకు గురించి చర్చించడానికి వెళ్తే.. దాన్ని అతను అవకాశంగా తీసుకున్నాడని ఆరోపించింది. తనతో మంచిగా నటిస్తూ ఓ రోజు అతని భార్య, పిల్లలు లేని సమయంలో తనింటికి తీసుకెళ్లి  లైంగికంగా వేధించాడని పేర్కొంది. అతని చర్యతో తనలో తను ఎంతో కుమిలిపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక రాహుల్‌ జోహ్రి బీసీసీఐ సీఈవో కాకముందు డిస్కవరీ చానల్లో పనిచేశారు.

Advertisement
Advertisement