ఇండియాతో మ్యాచ్; బంగ్లాదేశ్ ఫీల్డింగ్ | Bangladesh win the toss and choose to bowl | Sakshi
Sakshi News home page

ఇండియాతో మ్యాచ్; బంగ్లాదేశ్ ఫీల్డింగ్

Mar 15 2016 3:16 PM | Updated on Sep 3 2017 7:49 PM

ఇండియాతో మ్యాచ్; బంగ్లాదేశ్ ఫీల్డింగ్

ఇండియాతో మ్యాచ్; బంగ్లాదేశ్ ఫీల్డింగ్

మహిళల టీ20 ప్రపంచప్ ఆరంభ మ్యాచ్ లో భారత్, బంగ్లాదేశ్ తలపడుతున్నాయి. టాస్ గెలిచిన బంగ్లాదేశ్ ఫీల్డింగ్ ఎంచుకుంది.

బెంగళూరు: మహిళల టీ20 ప్రపంచప్ ఆరంభ మ్యాచ్ లో భారత్, బంగ్లాదేశ్ తలపడుతున్నాయి. టాస్ గెలిచిన బంగ్లాదేశ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. పటిష్టమైన ఆస్ట్రేలియా, శ్రీలంకపై సిరీస్ విజయాలు సాధించిన భారత మహిళల జట్టు ప్రపంచప్ లోనూ జోరు కొనసాగించాలని భావిస్తోంది.

గతంలో ఆడిన వరల్డ్‌కప్ టోర్నీల్లో రెండుసార్లు సెమీస్‌కు చేరిన భారత్... చివరి రెండుసార్లు మాత్రం గ్రూప్ దశలోనే వెనుదిరిగింది. అయితే ఈసారి ఫామ్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ టోర్నమెంట్‌లో మరోసారి సెమీస్‌కు చేరుకోవాలన్న లక్ష్యంతో టీమిండియా బరిలోకి దిగుతోంది. కెప్టెన్ మిథాలీ రాజ్‌తో పాటు ఏడుగురు క్రీడాకారిణిలకు 2014 టోర్నీలో ఆడిన అనుభవం ఉండడం భారత్ టీమ్ కు సానుకూలాశం.

మరోవైపు జహనరా నేతృత్వంలోని బంగ్లా జట్టు కూడా ఈ మధ్య కాలంలో బాగానే ఆడుతోంది. ఈ మ్యాచ్‌లో భారత్‌కు షాకిచ్చి టోర్నీలో ముందంజ వేయాలని బంగ్లాదేశ్ ప్రయత్నాలు చేస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement