రేప్ కేసులో బంగ్లా క్రికెటర్కు విముక్తి | Bangladesh cricketer Rubel Hossain acquitted in sexual assault case | Sakshi
Sakshi News home page

రేప్ కేసులో బంగ్లా క్రికెటర్కు విముక్తి

May 20 2015 8:36 PM | Updated on Jul 26 2019 5:49 PM

రేప్ కేసులో బంగ్లా క్రికెటర్కు విముక్తి - Sakshi

రేప్ కేసులో బంగ్లా క్రికెటర్కు విముక్తి

అత్యాచార కేసులో బంగ్లాదేశ్ క్రికెటర్ రూబెల్ హొసేన్కు విముక్తి లభించింది.

ఢాకా: అత్యాచార కేసులో బంగ్లాదేశ్ క్రికెటర్ రూబెల్ హొసేన్కు విముక్తి లభించింది. నటి నజ్నీన్ అక్తర్ దాఖలు చేసిన ఈ కేసును విచారించిన ఢాకా కోర్టు బుధవారం రూబెన్ను నిర్దోషిగా ప్రకటించింది. రూబెల్పై నమోదైన అభియోగాలను కొట్టివేసింది.

పెళ్లి పేరుతో నమ్మించి తనను అత్యాచారం చేశాడంటూ నజ్నీన్ రూబెల్పై కేసు పెట్టింది. ఇటీవల జరిగిన ప్రపంచ కప్ ముందు రూబెల్ను అరెస్ట్ చేశారు.తాజాగా కోర్టులో ఈ కేసు కొట్టివేయడంతో రూబెల్కు విముక్తి లభించినట్టయ్యింది. రూబెల్కు వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యాలూ లేవని పోలీసులు కోర్టుకు నివేదిక సమర్పించారు.

Advertisement
 
Advertisement
Advertisement