70 పరుగులకే ఆలౌటయిన బెంగళూర్ | bangalore set target of 71 for rajasthan | Sakshi
Sakshi News home page

70 పరుగులకే ఆలౌటయిన బెంగళూర్

Apr 26 2014 5:58 PM | Updated on Sep 2 2017 6:33 AM

మొన్న కోల్ కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో తృటిలో విజయాన్ని చేజార్చుకున్న బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్ ఇంకా ఆ షాక్ నుంచి తేరుకున్నట్టు లేదు.

అబుదాబి:మొన్న కోల్ కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో తృటిలో విజయాన్ని చేజార్చుకున్న బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్ ఇంకా ఆ షాక్ నుంచి తేరుకున్నట్టు లేదు. ఐపీఎల్ 7 లో భాగంగా శనివారం ఇక్కడ రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో బెంగళూర్ ఆటగాళ్లు 71 పరుగుల లక్ష్యాన్ని మాత్రమే నిర్దేశించారు. ఓపెనర్లు పార్థీవ్ పటేల్ (1), తకావాలే(0)కు పరిమితమై ఆదిలోనే బెంగళూర్ ను కష్టాల్లోకి నెట్టారు. అనంతరం కెప్టెన్ విరాట్ కోహ్లి(21)పరుగులు చేసి జట్టుకు మరమ్మత్తులు చేశాడు. కాగా యువరాజ్ సింగ్(3),డివిలియర్స్(0),రానా(3), మోర్కెల్ (7) ఇలా వరుసుగా క్యూకట్టడంతో బెంగళూర్ బ్యాటింగ్ లో చేతులెత్తేసింది.

 

చివర్లో స్టార్క్(18), రాంపాల్ (13) పరుగులు చేయడంతో బెంగళూర్ 15 ఓవర్లలో 70 పరుగులకే పరిమితమైంది. బెంగళూర్ ఆటగాళ్లలో 8మంది సింగిల్ డిజిట్ కే పరిమితమవడం గమనార్హం. రాజస్థాన్ బౌలర్లలో టాంబే నాలుగు వికెట్లు తీసి బెంగళూర్ పతనాన్ని శాసించగా, రిచర్డ్ సన్ కు రెండు వికెట్లు దక్కాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement