తెలంగాణ ప్రభుత్వంపై గుత్తా జ్వాల ఫైర్‌!

Badminton Player Gutta Jwala Fires On Telangana Govt - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వంపై బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి గుత్తా జ్వాల అసహనం వ్యక్తం చేశారు. బ్యాడ్మింటన్‌ అకాడమీ ఏర్పాటుకు సహకరిస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం ఇప్పటికీ ఆ దిశగా అడుగులు వేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాలుగేళ్లు గడిచినా ఇప్పటి వరకు స్థలం కేటాయించలేదని, ఇంటిస్థలం ఇస్తామని ఇవ్వలేదని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌, సీఎంవోకు ట్వీట్‌ చేశారు. అథ్లెట్స్‌కి తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సాహకాల కింద.. ప్లాట్‌‌ని ప్రకటించిందని.. అందులో భాగంగానే తనకు హామీ ఇచ్చారని, తను అడగలేదని పేర్కొన్నారు. అయితే ఇప్పటికీ తనకు మాత్రం ఆ ప్రోత్సాహకం అందలేదని గుత్తాజ్వాల ఆవేదన వ్యక్తం చేశారు.

గత ఏడాది క్రీడల మంత్రి పద్మారావుని కలిసిన గుత్తాజ్వాల రాష్ట్రంలో క్రీడల అభివృద్ధిపై ఆయనతో చర్చించారు. గత కొంతకాలంగా బ్యాడ్మింటన్‌లో రాజకీయాలపై బహిరంగంగానే పెదవి విరుస్తున్న గుత్తాజ్వాల.. ఇప్పుడు పూర్తిగా ఆటకి దూరమై అకాడమీని స్థాపించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top