ఇదెక్కడి ఔట్‌రా నాయనా! 

Australia Women Cricketer Completes One of the Most Bizarre Dismissals Ever - Sakshi

సిడ్నీ : ఆస్ట్రేలియా-న్యూజిలాండ్‌ మహిళల జట్ల మధ్య జరిగిన నామమాత్రపు వన్డే మ్యాచ్‌లో ఓ వింత ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను చూస్తే.. ఇలా కూడా ఔట్‌ అవుతారా? అని ఆశ్చర్యపోకుండా ఉండలేరు. అవును యావత్‌ క్రికెట్‌ ప్రపంచంలోనే ఇలాంటి ఔట్‌ ఇప్పటి వరకు జరిగుండదు. గురువారం జరిగిన ఈ మ్యాచ్‌లో ఆసీస్‌ పేసర్‌ హెథర్‌ గ్రహమ్‌ తీసిన వికెట్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో హాట్‌ టాపిక్‌ అయింది. కివీస్‌ ఇన్నింగ్స్‌ 45వ ఓవర్‌లో ఆ జట్టు బ్యాటర్‌ కాటీ పెర్కిన్స్‌ స్ట్రేట్‌ షాట్‌ ఆడింది. కానీ బంతి నాన్‌ స్ట్రైకర్‌గా ఉన్న కాటీ మార్టిన్‌ బ్యాట్‌కు తగిలి గాల్లోకి లేచింది. ఈ బంతిని పేసర్‌ హెథర్‌ అందుకోవడంతో కాటీ పెర్కిన్స్‌ రిటర్న్‌ క్యాచ్‌గా పెవిలియన్‌ చేరింది. అయితే ఇది ఔటా లేదా అనే విషయంలో మైదానంలోని ఆటగాళ్లు, అంపైర్లు సైతం గందరగోళానికి గురయ్యారు. ఫీల్డ్‌ అంపైర్లు థర్డ్‌ అంపైర్‌ సమీక్ష కోరగా.. ఔట్‌గా ప్రకటించారు. ఈ తరహా ఔట్‌తో మైదానంలో నవ్వులు పూసా​యి.

దీనికి సంబంధించిన వీడియోను  ఆస్ట్రేలియా మహిళా క్రికెట్‌ జట్టు తన అధికారిక ట్విటర్‌లో పోస్ట్‌ చేయడంతో తెగ వైరల్‌ అయింది. ఇదెక్కడి ఔట్‌రా నాయనా ! అంటూ నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు.  ఇక ఈ మ్యాచ్‌లో కివీస్‌ నిర్ణీత 50 ఓవర్లకు 7 వికెట్లు కోల్పోయి 323 పరుగుల చేయగా.. ఆతిథ్య ఆసీస్‌ గవర్నర్‌ జనరల్‌ ఎలెవన్‌ జట్టు 157 పరుగులకే కుప్పకూలింది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top