సిడ్నీ టెస్ట్‌ : ఆసీస్‌ 300 ఆలౌట్ 

Australia 300 All Out In Sydney Test Against Australia - Sakshi

5 వికెట్లతో చెలరేగిన చైనామన్‌ బౌలర్‌ కుల్దీప్‌

భారత్‌కు 322 పరుగుల భారీ ఆధిక్యం 

ఆసీస్‌కు తప్పని ఫాలోఆన్‌

సిడ్నీ : భారత్‌తో జరుగుతున్న ఆఖరి టెస్ట్‌లో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌ 300 పరుగుల వద్ద ముగిసింది. దీంతో భారత్‌కు 322 పరుగుల  భారీ ఆధిక్యం లభించింది. వర్షం అంతరాయంతో నాలుగో రోజు ఆట ఆలస్యంగా ప్రారంభమైనప్పటికీ ఆసీస్‌ ఇన్నింగ్స్‌ ఎంతో సేపు కొనసాగలేదు. 236/6 ఓవర్‌నైట్‌ స్కోర్‌తో బరిలోకి దిగిన ఆసీస్‌ ఆదిలోనే కమిన్స్‌ (25) వికెట్‌ కోల్పోయింది. ఆపై హ్యాండ్స్‌ కోంబ్‌ (37)ను బుమ్రా బౌల్డ్‌ చేయగా.. నాథన్‌ లయన్‌(0)ను కుల్దీప్‌ పెవిలియన్‌ చేర్చాడు. ఇక కుల్దీప్‌ బౌలింగ్‌లో హజల్‌వుడ్‌ ఇచ్చిన సునాయస క్యాచ్‌ను హనుమ విహారి జారవిడచడంతో భారత బౌలర్లు చివరి వికెట్‌  కోసం మరికొద్ది సేపు నిరీక్షించాల్సి వచ్చింది.

విహారి క్యాచ్ చేజార్చడంతో చివరి వికెట్‌ కోసం భారత బౌలర్లు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. కుల్దీప్‌ మరోసారి తన స్పిన్‌ మాయాజాలంతో హజల్‌వుడ్‌ (21)ను  పెవిలియన్‌ చేర్చడంతో  ఆసీస్‌ తొలి ఇన్నింగ్స్‌ పోరాటం ముగిసింది. దీంతో ఆతిథ్య జట్టు ఫాలో ఆన్‌ తప్పించుకోలేకపోయింది. స్టార్క్‌, హజల్‌ వుడ్‌లు చివరి వికెట్‌కు 42  పరుగల భాగస్వామ్యం నెలకొల్పడం గమనార్హం.  స్టార్క్‌ (29) నాటౌట్‌గా నిలిచాడు.  కుల్దీప్‌ ఐదు వికెట్లతో చెలరేగగా.. జడేజా, మహ్మద్‌ షమీలు రెండు వికెట్లు పడగొట్టారు. బుమ్రాకు ఒక వికెట్‌ దక్కింది.

భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ 622/7 డిక్లేర్డ్‌

ఆసీస్‌ తొలి ఇన్నింగ్స్‌ 300 ఆలౌట్‌


Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top