మరిన్ని బౌండరీలు బాదితే.. మా పని అయి పోయేది!

Aussie spinner Zampa speaks up after dismissing Kohli again - Sakshi

రాంచీ: భారత క్రికెట్‌ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లిపై ఆస్ట్రేలియా స్పిన్నర్‌ ఆడమ్‌ జంపా ప్రశంసలు కురిపించాడు. విరాట్‌ కోహ్లి ఒక అసాధారణ ఆటగాడిగా పేర్కొన్న జంపా.. అతనికి బౌలింగ్‌ చేయడం అంత సులభం కాదన్నాడు.  ఈ ద్వైపాక్షిక సిరీస్‌లో(టీ20 సిరీస్‌తో కలుపుకుని) జంపా బౌలింగ్‌లో కోహ్లి మూడుసార్లు ఔటయ్యాడు. రాంచీ వేదికగా జరిగిన మూడో వన్డేలో జంపా బౌలింగ్‌లోనే కోహ్లి పెవిలియన్‌ చేరాడు.
(ఇక‍్కడ చదవండి: టీమిండియా బ్యాటింగ్‌ ‘విచిత్రం’ చూశారా?)

దాంతో అప్పటివరకూ భారత్‌ వైపు ఉన్న మ్యాచ్‌ ఆసీస్‌ వైపు మొగ్గింది. దీనిపై మ్యాచ్‌ అనంతరం మాట్లాడిన జంపా.. కోహ్లిని ఔట్‌ చేయడం చాలా కష్టమన్నాడు.  ‘విరాట్ కోహ్లి చాలా సీరియస్ బ్యాట్స్‌మెన్. మ్యాచ్‌లో కీలకమైన అతని వికెట్ తీయడం చాలా సంతోషంగా ఉంది. సులువుగా నా బౌలింగ్‌‌లో అతను ఔటవుతాడనే అభిప్రాయాన్ని నేను ఒప్పుకోను. కోహ్లికి బౌలింగ్ చేయడం చాలా కష్టం. నేను కూడా ఒకింత ఒత్తిడికి గురయ్యాను. నా ఓవర్‌లో అతను మరో మరిన్ని బౌండరీలు కొట్టి ఉంటే..? మ్యాచ్ పూర్తిగా భారత్‌వైపు తిరిగిపోయేది’ అని వెల్లడించాడు. మూడో వన్డేలో కోహ్లి 95 బంతుల్లో 16 ఫోర్లు, 1 సిక్సర్‌ సాయంతో 123 పరుగులు సాధించాడు. కోహ్లి మంచి దూకుడుగా ఉన్న సమయంలో జంపా బౌలింగ్‌లో ఔటయ్యాడు.
(ఇక్కడ చదవండి: డీఆర్‌ఎస్‌పై మరో వివాదం)

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top