మలింగ మ్యాజిక్ | Asia Cup: Malinga takes five wickets as Sri Lanka beat Pakistan by 12 runs | Sakshi
Sakshi News home page

మలింగ మ్యాజిక్

Feb 26 2014 1:11 AM | Updated on Sep 2 2017 4:05 AM

మలింగ మ్యాజిక్

మలింగ మ్యాజిక్

లసిత్ మలింగ (5/52) అద్భుత బౌలింగ్‌తో ఆసియా కప్‌లో శ్రీలంక శుభారంభం చేసింది. పాకిస్థాన్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో ఒక దశలో ఓటమికి చేరువైనా...

ఆసియా కప్‌లో శ్రీలంక బోణి  
 12 పరుగులతో పాక్‌పై విజయం
 
 ఫతుల్లా: లసిత్ మలింగ (5/52) అద్భుత బౌలింగ్‌తో ఆసియా కప్‌లో శ్రీలంక శుభారంభం చేసింది. పాకిస్థాన్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో ఒక దశలో ఓటమికి చేరువైనా...స్ఫూర్తిదాయక ఆటతీరుతో లంక మ్యాచ్ నిలబెట్టుకుంది. ఇక్కడి ఖాన్ ఉస్మాన్ అలీ స్టేడియంలో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక 12 పరుగుల తేడాతో పాకిస్థాన్‌ను ఓడించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన లంక నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 296 పరుగులు చేసింది.
 
 లాహిరు తిరుమన్నె (110 బంతుల్లో 102; 11 ఫోర్లు, 1 సిక్స్) శతకం సాధించగా...సంగక్కర (65 బంతుల్లో 67; 8 ఫోర్లు), మాథ్యూస్ (50 బంతుల్లో 55 నాటౌట్; 5 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. అనంతరం పాక్ 48.5 ఓవర్లలో 284 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ మిస్బావుల్ హక్ (84 బంతుల్లో 73; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), ఉమర్ అక్మల్ (72 బంతుల్లో 74; 7 ఫోర్లు, 3 సిక్స్‌లు) పోరాడినా జట్టును గెలిపించడంలో విఫలమయ్యారు. మిస్బా, అక్మల్ జోరుతో పాక్ పటిష్టంగా కనిపించినా...మలింగ చెలరేగి లంకకు విజయాన్నందించాడు.
 
 టర్నింగ్ పాయింట్
 లక్ష్యఛేదనలో పాకిస్థాన్ తొలుత కాస్త తడబడ్డా... మిస్బా, అక్మల్ 19 ఓవర్ల వ్యవధిలో 121 పరుగులు జోడించడంతో విజయానికి చేరువైంది. అయితే మలింగ ఒకే ఓవర్లో ఆఫ్రిది, మిస్బాలను అవుట్ చేసి మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. చివర్లో కాస్త ఉత్కంఠపెరిగినా మలింగ మ్యాజిక్‌తో మ్యాచ్ లంక వశమైంది. పాక్ చివరి ఐదు వికెట్లను 42 పరుగుల వ్యవధిలో కోల్పోయింది.
 
  స్కోరు వివరాలు
 శ్రీలంక ఇన్నింగ్స్: కుషాల్ పెరీరా (సి) అక్మల్ (బి) గుల్ 14; తిరిమన్నె (బి) అజ్మల్ 102; సంగక్కర (సి) షెహజాద్ (బి) గుల్ 67; జయవర్ధనే (బి) ఆఫ్రిది 13; మాథ్యూస్ (నాటౌట్) 55; తిసార పెరీరా (సి) షెహజాద్ (బి) ఆఫ్రిది 6; డిసిల్వ (రనౌట్) 2; చండీమల్ (నాటౌట్) 19; ఎక్స్‌ట్రాలు 18; మొత్తం (50 ఓవర్లలో 6 వికెట్లకు) 296.
 
 వికెట్ల పతనం: 1-28; 2-189; 3-204; 4-224; 5-245; 6-251.
 బౌలింగ్: హఫీజ్ 9-0-54-0; గుల్ 8-0-38-2; జునేద్ 9-0-61-0; భట్టీ 4-0-27-0; అజ్మల్ 10-0-50-1; ఆఫ్రిది 10-0-56-2.
 
 పాకిస్థాన్ ఇన్నింగ్స్: షర్జీల్ (సి) మాథ్యూస్ (బి) లక్మల్ 26; షెహజాద్ (బి) డిసిల్వ 28; హఫీజ్ (ఎల్బీ) (బి) మాథ్యూస్ 18; మఖ్సూద్ (సి) డిసిల్వ (బి) సేనా నాయకే 17; మిస్బా (సి) సేనా నాయకే (బి) మలింగ 73; అక్మల్ (సి) సంగక్కర (బి) లక్మల్ 74; ఆఫ్రిది (సి) చండీమల్ (బి) మలింగ 4; భట్టీ (బి) మలింగ 18; గుల్ (సి) డిసిల్వ (బి) మలింగ 2; అజ్మల్ (ఎల్బీ) (బి) మలింగ 10; జునేద్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (48.5 ఓవర్లలో ఆలౌట్) 284.
 వికెట్ల పతనం: 1-28; 2-77; 3-83; 4-121; 5-242; 6-252; 7-254; 8-262; 9-281; 10-284.
 
 బౌలింగ్: మలింగ 9.5-0-52-5; లక్మల్ 9-1-65-2; సేనా నాయకే 9-0-47-1; డిసిల్వ 10-1-56-1; పెరీరా 6-0-36-0; మాథ్యూస్ 5-1-25-1.
 
 2  అంతర్జాతీయ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్‌లు కలిపి మహేల జయవర్ధనే 600 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్నాడు. సచిన్ (664) తర్వాత ఈ ఘనత సాధించిన రెండో క్రికెటర్.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement