హైదరాబాద్ క్రికెట్ కోచ్‌గా అరుణ్‌కుమార్
హైదరాబాద్ క్రికెట్ టీం కోచ్‌గా జె. అరుణ్‌కుమార్ నియమితులయ్యారు.
హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ టీం కోచ్‌గా జె. అరుణ్‌కుమార్ నియమితులయ్యారు. 2017-2018 సీజన్‌కుగాను అరుణ్‌కుమార్(42) జట్టు కోచ్‌గా వ్యవహరించనున్నారని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు జి. వివేకానంద్ తెలిపారు. అరుణ్‌కుమార్ కోచ్‌గా కర్ణాటక జట్టు అనేక టోర్నమెంట్లు గెలుచుకుందన్నారు. ఆయన శిక్షణలో హైదరాబాద్ జట్టు రాటుదేలుతుందన్న నమ్మకముందన్నారు.
జట్టుకు ప్రస్తుతం కోచ్‌గా ఉన్న భరత్ అరుణ్ జాతీయ టీంకు బౌలింగ్ కోచ్‌గా నియమితులు కావటంతో ఈ స్థానంలో అరుణ్‌కుమార్‌ను ఎంపిక చేశారు. లెఫ్ట్‌హ్యాండ్ బ్యాట్‌మన్‌గా 1993-94 లో ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అడుగుపెట్టిన అరుణ్ కుమార్ 2008 లో రిటైరయ్యారు. ఐపీఎల్ పంజాబ్ ఎలెవన్ జట్టుకు కూడా ఆయన కోచ్‌గా పనిచేశారు.