విజేతలు ఆర్నవి, వేదాంత్‌ | Arnavi, Vedanth Win Skating Titles | Sakshi
Sakshi News home page

విజేతలు ఆర్నవి, వేదాంత్‌

Nov 17 2018 10:33 AM | Updated on Nov 17 2018 10:33 AM

Arnavi, Vedanth Win Skating Titles - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర అంతర్‌ జిల్లా రోలర్‌ స్కేటింగ్‌ చాంపియన్‌షిప్‌లో ఆర్నవి, వేదాంత్‌ విజేతలుగా నిలిచారు. ఇందిరాపార్క్‌లో ని స్కేటింగ్‌ రింక్‌లో జరిగిన ఈ టోర్నీ అండర్‌–8 బాలికల ఇన్‌లైన్‌ ఈవెంట్‌లో నిజామాబాద్‌కు చెందిన ఆర్నవి అగ్రస్థానాన్ని దక్కించుకుంది. మనోజ్ఞ (మహబూబ్‌నగర్‌) రన్నరప్‌గా నిలవగా, స్నిగ్ధ (నల్లగొండ) మూడోస్థానాన్ని సాధించింది. బాలుర విభాగంలో వేదాంత్‌ (నల్లగొండ) చాంపియన్‌గా నిలిచాడు. కుషాగ్ర నిగమ్‌ (నల్లగొండ), కార్తీక్‌ (హైదరాబాద్‌) వరుసగా రెండు, మూడు స్థానాలను దక్కించుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement